Tuesday, November 26, 2024

నక్తం ఎప్పుడు? ఎలా చేయాలి?

కార్తీక మాసంలో నక్తాలు ఉంటారు. నక్తాలు ఉండటం అంటే ఉపవాసాలు ఉండటం అని అర్థం. నక్తం అంటే రాత్రిపూట అని అర్థం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయ టాన్ని నక్తవ్రతమని, నక్త భోజనమని అంటారు. రాత్రిపూట తిన మన్నారు కదా అని పదిగంటలకో, పదకొండు గంటలకో చేయకూడదు. సూర్యాస్తమయం అయి చుక్కలు కనిపించే సమయానికి చేయాలి. ఇలా చేయటం ఆరోగ్యం. ఈ వ్రతం కేవలం కార్తీకంలోనే కాదూ సంవత్సరంలో అన్ని మాసాలలోను కొన్ని ప్రత్యేక తిథులలో ఆచ రించటం ఆరోగ్యానికి మంచిదని, పుణ్య ప్రద మని చెబుతున్నది లింగపురాణం.
నక్తవ్రతం కేవలం ఒంటిపూట ఉపవాసం తోనే ముగియదు. ఆ సందర్భంలో కొన్నికొన్ని దానాలు, ధర్మాలు చేయాలి. ప్రాత:కాల స్నానం, భస్మ, రుద్రాక్ష ధారణ, భగవన్నామ స్మరణలు, ప్రణవ శివ షడక్షర మహామంత్ర జపాలు చేయాలి. పెసర పప్పు, బియ్యం కలిపిన అన్నాన్ని తినాలి. కార్తీకమాసంలో నక్తం చేసి శివుడిని పూజించి నెయ్యితో కూడిన క్షీరాన్ని నివేదించి, కపిల గోమిధునాన్ని దానమివ్వటం, అన్న దానాలు చేస్తే సూర్యలో కార్హత పొందుతారు. మార్గశిరంలో పున్నమినాడు శివాభిషేకం చేసి భోజనాలు పెట్టడం, తెలుపు రంగు గల గోమిధునాన్ని దానమిస్తే సోమలోక నివాస అర్హత లభిస్తుంది. పుష్య మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో రెండు పక్షాలలో వచ్చే అష్టమి తిథులు, పూర్ణిమ నాడు వ్రతం చేసి, ఆవు నెయ్యితో రుద్రుడికి అభిషేకించాలి. కపిల గోవు, ఎద్దు దానం చేస్తే ఆగ్నేయాది లోకాలు ప్రాప్తిస్తాయి. మాఘంలో చతుర్దశి, పౌర్ణమిలలో వ్రతం చేయవచ్చు. నెయ్యి, గొంగళి, నలుపు రంగు ఆవు, ఎద్దు దానంచేస్తే యమధర్మరాజు సంతుష్టుడవుతాడు. ఫాల్గుణంలో చతుర్దశి, అష్టమి, పూర్ణిమలలో రుద్రాభిషేకం చేయాలి. చైత్రంలో నిరుతిలోకం లభిస్తుంది. వైశా ఖంలో వ్రతం చేసి తెల్లటి ఆవు, ఎద్దును దానమిస్తే అశ్వమేథ ఫలం దక్కుతుంది. జ్యేష్టంలో ధూమ్రవర్ణంలో ఉన్న గోమిధునాన్ని దానం చేయాలి. ఆషాఢంలో చెరకు రసం, నెయ్యి, పేలపిండి, ఆవు పాలను స్వీకరిస్తూ వ్రతాన్ని చేస్తే వరుణలోక ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ పూర్ణిమనాడు వ్రతంచేసి ఆవునెయ్యితో శివా భిషేకం, అన్న దానం చేస్తే వాయు సాయుజ్యం, ఆశ్వీయుజ పౌర్ణమికి రుద్రాధ్యా యంతో శివుడి అభిషేకం చేస్తే ఈశానలోకం లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement