Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : స న్మిత్రుడు (బి)

మహాభారత సంకలనం సుభాషిత సుధానిధిలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

శోకారాతి పరిత్రాణ ం ప్రీతి విస్రంభ భాజనమ్‌
కేన సృష్ట మిదం రత్నం మిత్ర మిత్యక్షర ద్వయమ్‌

దు:ఖము నుండి శత్రువుల నుండి రక్షించునది, ప్రీతికి వి శ్వాసానికి ఆవాసము అయినది మిత్ర అను రెండు అక్షరముల రత్నమును ఎవరు సృష్టించినారో కదా !

దు:ఖము వచ్చినపుడు మొదట చెప్పుకొనేది మిత్రునికే అలాగే మిత్రుని సహాయముతో శత్రువు నుండి తనను తాను రక్షించుకొనును. అదేవిధంగా సాటిలేని ప్రీతి, విశ్వాసము ఈ రెండు మిత్రుని యందే ఉండును కావున మిత్ర అను ఈ రెండక్షర రత్నమును సృష్టిం చిన వారు ఎవరో కదా!

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement