Saturday, November 23, 2024

ధర్మం- మర్మం : శ్రావణ శుద్ధ షష్ఠి (ఆడియోతో…)

శ్రావణ శుద్ధ షష్ఠి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శ్రావణ శుద్ధ షష్ఠి హస్తా నక్షత్రంతో కూడియున్నపుడు కల్కి జయంతిగా వ్యవహరిస్తారు. కల్కి అవతారం కలియుగాంతంలో న్యాయము, ధర్మము, సత్యము పరిపూర్ణంగా క్షీణించి ప్రాణిజాతం బతకలేని స్థితిలో క ల్కావతారం అవతరిస్తుంది. అధర్మాన్ని, అధర్మాత్ములను రూపుమాపి ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించిన మహానుభావుడు కల్కి. ఈ భగవానుని ఆరాధించిన వారికి సత్యవాక్‌ పరిపాలన, ధ ర్మతత్పరత, సామాజిక సంక్షేమ దృష్టి, సకల జనుల శాంతిసౌభాగ్యాల రక్షణ చేయాలనే ఉత్తమ సంకల్పం కలిగి ఉంటారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement