Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : శ్రావణ శుద్ధ పంచమి (ఆడియోతో…)

శ్రావణ శుద్ధ పంచమి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

షష్ఠితో కూడిన పంచమిని నాగపంచమి అని వ్యవహరిస్తారు. ఆనాడు నాగపూజను ఆచరించాలని చమత్కార చింతామణి అనే గ్రంథంలో ప్రస్తావించబడింది. హేమాద్రి మరియు భవిష్య పురాణాలనుసారం ఈనాడు ద్వారానికి రెండు వైపులా పేడతో పాముల బొమ్మను గీసి ఒక గురిగెడు పెరుగు, గరిక పోచలు, దర్భలు, పుష్పములు మొదలైనవాటితో శాస్త్రప్రకారం పూజించాలి. పెద్దలను, గురువులను భోజన ద క్షిణ తాంబూలాదులతో సంతృప్తి పరచాలి. భక్తితో కూడిన ఈ దినమున నాగులను పూజించినవారికి పాము భయం తొలగుతుంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుద్ధ చతుర్థిని నాగచతుర్థిగా ఆచరిస్తారు. శ్రావణ పంచమిని గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు. ఆనాడు గరుక్మతుండిని, గరుక్మతుండిని అధిష్టించే శ్రీమహావిష్ణువును అమ్మవారితో కూడి ఆరాధిస్తారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement