శ్రావణ శుద్ధ తదియ విశిష్టత గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
శ్రావణ శుద్ధ తదియ లేదా విదియ పుబ్బ నక్షత్రం కూడి ఉన్న రోజు గోదాదేవి పుట్టినరోజు. సంప్రదాయం తెలిసినవారు తేదీ ప్రకారం కాకుండా పుట్టిన నక్షత్రాన్ని అనుసరించి పుట్టిన రోజును జరుపుకుం టారు. అందుకే శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆండాళ్ తిరునక్షత్రం అని వ్యవహరిస్తారు. ఆనాడు తెల్లవారుజామున నిద్ర లేచి అభ్యంగనాదులు ఆచరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రపరుచుకొని బ్రాహ్మణులను, పెద్దలను, బంధువులను ఆహ్వానించి యధోక్త విధితో గోదారంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్ర ద్ధలతో ఆచరిస్తే కన్యలకు వివాహప్రాప్తి, వివాహమైన వారికి ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతాయి.
గుజరాత్ వాసులు మధుశ్రవ అని పిలిచే ఈ పండుగనాడు 24 రకాల పుష్పాలను, ఫలాలను ఒక చోట చేర్చి పండ్ల రసము తీసి తాము ఆరాధించు దేవతకి అభిషేకం చేయవలెను. మధుర పదార్థాలను నివేదన చేసి పెద్దలకు భోజనతాంబాలాదులు సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా చేసిన వారికి సంవత్సరకాలమంతా మంచి ఫలితాలు లభిస్తాయని స్కాంద, బ్రహ్మాండ, పాద్మ పురాణాలలో వివరించబడింది.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి