అన్నదానం…
మధ్యాహ్నే బ్రాహ్మణం ప్రాప్తం అతిధిం భోజ యే ద్యది
న తస్య షల విశ్రాంతి : బ్రహ్మణాపి నిరూపిత :
సద్యస్వాధ్యాయనం నౄణాం అన్నదానం నరాధిప
తస్యాన్నేన సదృశం దానం త్రిశులోకేశు విద్యతే
మార్గ శ్రాంతాయ విప్రాయ ప్రశ్రయం ప్రదదాతియ:
తస్య పుణ్యఫలం వ క్తుం బ్రాహ్మణాపి నశక్యతే
దారాపత్య గృహదీనే వాసోలంకార భూషణం
అసహ్యం నాశ్నత : పుంసాం సహ్యం భుక్త వత: ద్రువం
తస్మాదన్న సమందానం నభూతం న భవిష్యతి
వైశాఖమాసమున మధ్యాహ్న కాలంలో ఇంటికి వచ్చిన అతిధిని భుజింప చేసినచో కలుగుఫలం ఎంతటిదో బ్రహ్మకూడా వివరించజాలడు. వేదాధ్యయనం చేయుట, నరులకు అన్నదానము చేయుట ఈరెండింటిలో అన్నదానమునకు సమానమైనది మరొకటి లేదు. అలసివచ్చిన బ్రాహ్మణులకు ఆశ్రయమునిచ్చిన వారి కి కలుగు పుణ్యఫలము ఎంతో ఎవరూ చెప్పజాలరు. తినుటకు అన్నము లేనివారికి భార్య, సంతానము, గృహములు, వస్త్రములు, అలంకారములు, ఆభరణములు సహింపరానివి అగును. చక్కగా భుజించిన వారికి ఇవన్ని ఆనందమునిచ్చును. కావున అన్నదానముతో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు ఇకముందు ఉండదు.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి