ఛత్ర- పాదుక దానం
అచ్ఛత్రదో నరోయస్తు వైశాఖే మాధవ ప్రియే
ఛాయ హీనౌ మహాక్రూర : పిశాచౌ భువిజాయతే
యోదద్యాత్ పాదకే దివ్యే మాధవే మాధవ ప్రియే
యమదూతాం తిరస్కృత్య విష్ణులోకం సగచ్యతి
పాదత్రాణంతు యోదద్యాత్ విశాఖే మాధవగమే
న తస్య నారకోలోక : ఐశా నక్లేశా ఐహికాశ్చయే
పాదుకే యాచమానాయ యోదద్యాత్ బ్రాహ్మణాయచ
సభూపాల: భవేత్ భూమౌ కోటి జన్మ స్వసంశయం
అనాధ మండపం మార్గే శ్రమహారి కరోతియ :
తస్య పుణ్యఫలం వ క్తుం బ్రహ్మణాపి నశక్యతే
శ్రీమహా విష్ణువుకి ప్రియమైన వైశాఖమాసమున ఛత్రదానము చేయనివాడు నిలువనీడ లేని వాడై మహా క్రూరమైన పిశాచముగా జన్మించును. శ్రీమహావిష్ణువుకు ప్రియమైన ఈ మాసమున దివ్యమైన పాదుకలను అనగా పాదరక్షలని దానం చేసినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. అదేవిధంగా వసంత ఋతువు రాకలో వైశాఖ మాసమున పాదరక్షలను ఇచ్చిన వారు నరకమును పొందరు. యాచించు బ్రాహ్మణునకు పాదుకలను దానం చేసినవారు కోటి జన్మలలో చక్రవర్తిగా పుట్టును. దారిలో నడుచు వారి కోసంనీడనిచ్చు ఒకచిన్న మండపమును నిర్మించినవారికి ఎంతటి పుణ్యఫలమో బ్రహ్మకూడా చెప్పజాలడు.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి