న జలేన సమం దానం న సుఖం భార్యాయాసమం
న కృషేస్తు సమం విత్తం న లాభో జీవితాత్పర:
న తపో అనసనాత్ తుల్యం న దానాత్ పరమం సుఖం
న ధర్మస్తు దయా తుల్య: న జ్యోతి: చక్షుషా సమం
న తృప్తి: అసనాత్ తుల్య న వాణిజ్యం కృషే సమం
న ధర్మేన సమం మిత్రం న సత్యేన సమం యశ:
న రోగ్య సమ ముక్తానాం న త్రాతా కేశవాత్పర:
న మాధవ సమం లోకే పవిత్రం కవయోవిదు:
జలదానంతో సమానమైన దానం భార్యతో సమానమైన సుఖం మరొకటి లేదు. కృషితో సమానమైన ధనం బ్రతుకును మించిన లాభం మరొకటి లేదు. ఉపవాసాన్ని మించిన తపస్సు, దానాన్ని మించిన సుఖం మరొకటి లేదు. కంటితో సమానమైన వెలుగు, భోజనం చేసిన దానితో సమానమైన తృప్తి మరొకటి లేదు, కృషితో సమానమైన వాణిజ్యం, ధర్మంతో సమానమైన మిత్రుడు మరొకడు లేడు. సత్యముతో సమానమైన కీర్తి, ఆరోగ్యంతో సమానమైన అభివృద్ధి మరొకటి లేదు. కేశవుని మించిన రక్షకుడు మరొకరు లేరని వైశాఖమాసముతో సమానమైనది, పవిత్రమైనది మరొకటి లేదని పండితుల ఉవాచ.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి