యోగచ్ఛేత్ అనుయామంతు స్నాతుం మేష గతై రభౌ
సర్వబంధ వినిర్ముక్త: విష్ణో: సాయుజ్య మాప్నుయాత్
త్రైలోక్య యాని తీర్ధాని బ్రహ్మండాంతర్గతానిచ
తాని సర్వాని రాజంతి సభాహ్యే అల్పకే జలే
తావల్లి ఖితపాపాని గర్జంతి యమశాసనే
సూర్యుడు మేషరాశిలో ఉండగా బయట జలములో ప్రతిజాము స్నానమాచరించుటకు వెళ్లినవారు సకల సంసారబంధములను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు సాయిజ్యమును పొందెదరు. మూడులోకములలో ఉన్న తీర్ధములు, బ్రహ్మాండమంతటా ఉన్న తీర్ధములు వైశాఖమాసమున బయటవున్న జలములో ఉండును. వైశాఖమాసములో బయట జలములో స్నానం చేయకుంటే యమశాసనమున పాపములు గర్జించును. వైశాఖమాసమున సకల తీర్ధ దేవతలు బయటవున్న జలములో ఉండును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి