యోదద్యాత్ కశిపుం మాసే వైశాఖే స్నాన వల్లభే
సర్వభోగ సమాయుక్త : తస్మిన్నేవహి జన్మని
సాన్వయోవర్తతే నూనం రోగాదిభి రనాహత:
ఆయుష్యం పరమారోగ్యం యేశోధైర్యం చ విందతి
నధార్మిక : కులే దస్య జాయతే శత పౌరుషం
భుక్త్వాతు సకలాన్ భోగాన్ తత : పంచత్వమేష్యతి
నిర్ధూతాకిల పాపస్తు బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి
స్నానమునకు ప్రియమైన వైశాఖ మాసమున పరుపును దానము చేసిన వారు ఆ జన్మలోనే సకల భోగములను పొందెదరు. అతని వంశమంతా రోగాధి బాధలు లేకుండా ఉండును. ఆయుష్యమును, ఆరోగ్యమును, యశమును ధైర్యమును పొంది అతని వంశంలో నూరు తరముల వరకు అధర్మాత్ములు జన్మించరు. ఈ విధంగా పరుపును దానము చేసిన వారు సకల భోగములను అనుభవించి ఉత్తమ లోకములను పొందెదరు. ఈ విషయమును తెలిసిన వారు వైశాఖమాసంలో సదాచార సంపన్నుడైన బ్రాహ్మణోత్తమునకు శయ్యాదానం చేసి ఇహపరములలో సకల భోగములను పొందవచ్చును.
ఈ విధంగా స్కాంద పురాణమున చెప్పబడిన వైశాఖ మాస మహత్మ్యమును విశేషించి జల, ఛత్ర, పాదుక, అన్న పర్యంక దానములు చేసి చివరకు ఒక విసినకర్రనునైనా దానం చేసి భగవంతుని కృపకు పాత్రులు కాగలరు.
– శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి