Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : వై శాఖమాస వైభవం–15 (ఆడియోతో)…

01.05.18

శయ్యాదానం….

యోమర్య్తో ద్విజవర్యాయ పర్యంకంతు దదాతి :
యత్రస్వస్త : సుఖంసేతే శీతానిల నిషేవిత :
ధర్మసాధన భూతోహి దేహో నైరుద్యమాప్నుతే
తం దత్వా సకలం పాపం నిరశ్య గత కల్మష :
అఖండ పదవీం యాతి యోగినామపి దుర్లభం
వైశాఖే ధర్మదత్తానాం శ్రాంతా నాంతు ద్విజన్మనాం
దత్వాశ్రమాపహం దివ్యం పర్యంకం మనుజేశ్వరా
న జాతు సీదతే లోకే జన్మమృత్యు జరాదిభి

వైశాఖ మాసమున బ్రాహ్మణోత్తమునకు శయ్యాదానము చేయవలెను. ఆ విధముగా దానము చేసిన శయ్యపై చల్లని గాలి వీచుచుండగా సంతోషముగా, సుఖముగా నిదురించిన నాడు, ధర్మమునకు సాధనమైన దేహము ఆ శయ్యపై రోగనివృత్తిని పొందినచో, అటువంటి శయ్యనిచ్చువారు అన్ని పాపములను తొలగించుకొని కల్మషము లేనివారై యోగులకు కూడా లభించని పరమపదమును చేరును. వైశాఖమాసమున ఎండవేడిమి తాళలేక అలసిన వారికి విశేషించి బ్రాహ్మణులకు శ్రమను దూరము చేయు శయ్యను దానము చేసినవారు ఈ లోకమున ఏబాధను పొందరు. అటువంటి వారు మరల జన్మ జరా మరణములు పొందరు అనగా మరల జన్మించరు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement