Friday, November 22, 2024

ధర్మం – మర్మం : వై శాఖమాస వైభవం 14 (ఆడియోతో…)

అన్నదానం…

వైశాఖే యేన చాదత్తం మార్గ శ్రాంతేచ భూసురే
సపిశాచో భవత్‌ భూమౌ స్వమాంసాన్యేవ ఖాదతి
యధా విభూతి దాతవ్యం తస్మాత్‌దన్నం ద్విజాతయే
అన్నదోమాతృపిత్రాదీన్‌ విస్మాయపి భూమిప
తస్మాదన్నం ప్రశంసంతి లోకా: త్రలోక్య వర్తిన :
మాతర : పితరశ్చాపి కేవలం జన్మహేతవ
అన్నదం పితరంలోకే వదంతిచ మనీషిణ :
అన్నదే సర్వతీర్ధాని అన్నదే సర్వ దేవతా :
అన్నదే సర్వధర్మాశ్చ తిష్టంత్యరి ధరాజయ

వైశాఖమాసమున అలసిన బాటసారికి అన్నమును పెట్టనివారు పిశాచిగా పుట్టి తన మాంసమును తానే తినును. సంపదకు అనుగుణముగా అన్నదానము చేయవలెను. అన్నదానము చేసిన వారు పరలోకమున ఉన్న మాతాపితరులకు ఉత్తమగతిని కలిగించును. కావున మూడు లోకములలోని వారు అన్నదానమును ప్రశంసించుచున్నారు. తల్లిదండ్రులు కేవలం శరీరమునిచ్చిన వారు మాత్రమేనని అన్నము పెట్టిన వారే నిజమైన తండ్రి అని పండితుల ఉవాచé. అన్నదానము చేసిన వారిలో అన్ని తీర్థములు, సమస్త దేవతలు, అన్ని ధర్మములు కొలువై ఉండును. అందువలనే అన్ని దానముల కన్నా అన్నదానము ప్రశస్తమైనది అందున వైశాఖమాసములో చేసే అన్నదానము మరింత ప్రశస్తమైనది.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement