ఉర్వారు గుడ సంమిశ్రం వైశాఖే మేషగే రవౌ |
సర్వపాప వినిర్ముక్త: శ్వేతద్వీపే వసే ద్ధ్రువమ్ ||
యశ్చేక్షు దండం సాయాహ్నే దివా తాపోపశాంతయే |
బ్రహ్మణాయ చ యోదద్యాత్ తస్య పుణ్యమనస్తకమ్ ||
వైశాఖే పానకం దత్త్వా సాయాహ్నే శ్రమశాన్తయే |
సర్వపాప వినిర్ముక్త: విష్ణో సాయుజ్యమాప్నుయాత్ ||
సఫలం పానకం మేషమాసే సాయం ద్విజాయతే |
దద్యాత్తేన పితౄణాంతు సుధాపానం నసంశయ: ||
ఉర్వారము, గుడము కలిపిన దానిని బ్రాహ్మముణకు దానము చేసినచో అది వైశాఖ మాసమున రవి మేషమున ఉన్నప్పుడు సర్వపాప వినిర్ముక్తుడై శ్వేతద్వీపమున అతను నివసించును. సాయంకాలం కానీ, పాపము లేని తాపము తొలగుటకు చెరుకుగడను బ్రాహ్మణునకు ఇచ్చివాడు పొందు పుణ్యఫలం అనంతం. వైశాఖ మాసమును సాయాహ్నము పానకమును దానము చేసి శ్రమశాంతికి సకల వి నిర్ముక్తుడై శ్రీవిష్ణు సాయుజ్యమును పొందును. మేష మాసమున బ్రాహ్మణునకు సాయంకాలం ఫలములతో కూడిన పానకమును దానము చేసినచో అది పితరులకు సుధాపానమగుననడంలో సందేహము లేదు.
– శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి