Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాస వైభవం-24 (ఆడియోతో)…

ఔదుంబరం బిల్వఫలం తథా శ్లెష్మాతకీ ఫలమ్‌ |
సర్వధా వర్జయేద్విద్వాన్‌ మాసేస్మిన్మాధవ ప్రియే ||

ఏతేష్వన్యతమం భుక్త్వాస చండాలో భవేద్ధ్రువమ్‌ |
తిర్యగ్యోని శతం యాతి నాత్రకార్యా విచారణా ||

ఏవం మాసవ్రతం కుర్యాత్‌ ప్రీతయే మధుఘాతిన: |
ఏవం వ్రతే సమాప్తేతు ప్రతిమాం కారయే ద్విభో: ||

మధుసూదన దైవత్యాం సవస్త్రాం చ సదక్షిణామ్‌ |
స్వర్చితాం విభవైస్సర్వై: బ్రాహ్మణాయ నివేదయేత్‌ ||

మేడి, మారేడు, నీరుకల కూరగాయలు మాధవ ప్రియమైన ఈ మాసమున పూర్తిగా విడువవలయును. వీటిలో యే ఒక్కటి తిన్నను అతను చండాలుడగును, నూరుజన్మలు పశువుగా పుట్టును అనుడంలో ఆలోచించవలసినది యేది లేదు. ఇట్లు మాసవ్రతమును శ్రీహరి ప్రీతికి
చేయవలయును. ఇట్లు వ్రతము సమాప్తి అయిన తరువాత మధుసూదన ప్రతిమను వస్త్రదక్షిణములతో సిద్ధము చేసి చక్కగా ఆరాధించి అన్ని సంపదలతో బ్రాహ్మణునకు అర్పించవలయును.

- Advertisement -

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement