Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాస వైభవం-23 (ఆడియోతో)…

తైలాభ్యంగం వర్జయేచ్చ కాంస్యం పాత్రేతు భోజనమ్‌
నిషిద్ధ భక్షణం చైవ వృధాలాపంతు వర్జయేత్‌

ఆలాబుం గుంజరం చైవ లశునం తిల పిష్ట కమ్‌
ఆరనాలం భిస్సటంచ ఘృతకోశాతికీం తథా

ఉపోదకీం కలింగం చ శిముశాకం చ వర్జయేత్‌
నిష్పావాని కలుత్థాని మస్కరాణిచ వర్జయేత్‌

వృంతాకాని కలింగాని క్రోదవాణి చ వర్జయేత్‌
తందులీయక శాకం చ కౌసుంభం మూలకం తథా

వైశాఖ మాసమున తైలాభ్యంగనము చేసుకొనరాదు. కాంస్యపాత్రలో భుజించరాదు. నిషేధించినదానిని భుజించరాదు. వృధాలాపములను విడువవలయును. సొరకాయ, ముల్లంగి, వెల్లుల్లి, నువ్వుల పిండి, మునగకాయ, ఎర్రని శాకములు, దినుసుగడ్డ, నేతి బీరకాయ, పెరుగుగడ్డలను, కలింగమును, బీరకాయను విడువవలయును. పొట్టులేని వాటిని, ఉలువలను, ఎర్ర కందిపప్పు తినరాదు. వంకాయలు, ఆలుగడ్డలు, కోద్రవములు విడువవలయును. గోంగూరను, కుసుంభమును, ఉల్లిపాయను తినరాదు.

- Advertisement -

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement