Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాస వైభవం-22 (ఆడియోతో)…

ధర్మైర్మాధవమాసీయైర్యధా తుప్యతి కేశవ: |
న తథా సర్వదానైశ్చ తపోభిశ్చ మహామఖై: ||

నానేన సదృశో ధర్మ: సర్వధర్మేషు విద్యతే |
మా గయాం యాంతు మాగంగాం మాప్రయాగం తు పుష్కరమ్‌ ||

మా కేదారం కురుక్షేత్రం మా ప్రభాసం స్యమన్తకమ్‌ |
మా గోదాం మాచ కృష్ణాంచ మాసేతుం మామరుద్వృధమ్‌ ||

వైశాఖధర్మ మామాత్మ్యం శంసన్తీ చ కథాపగా |
తత్ర స్నాతస్యవై విష్ణ ు: సద్యోహృద్య వరుధ్యతి ||

మాధవ మాస ధర్మములతో శ్రీహరి సంతోషించినట్లు ఇతర సకల దానములచే తపస్సులతో మహా యజ్ఞములతో సంతోషించడు. ఈ వైశాఖ మాస ధర్మముతో సమానమైన ధర్మము సకల ధర్మములలో ఇంకొకటి లేదు. గయకు కాని గంగానదికి కాని ప్రయాగకు కాని పుష్కరమునకు కాని
కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, స్యమన్తకమునకు, గోదావరికి, కృష్ణ వేణికి, సేతువునకు, మరుత్‌ క్షేత్రమునకు వెళ్ళవలసిన పనిలేదు. వైశాఖ ధర్మ మహాత్మ్యమును చెప్పు కథానదిలో స్నానము చేసినవానికి శ్రీమహావిష్ణ ువు వెంటనే హృదయమున నిలుచును.

- Advertisement -

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement