Saturday, November 23, 2024

ధర్మం-మర్మం : వైశాఖ మాస వైభవం-20(ఆడియోతో)

వైశాఖే కాంస్య భోజీయ స్తధా చా శ్రుత సత్కథ: |
నస్నాతో నాపి దాతా చ నరకానేవ గచ్ఛతి ||

బ్రహ్మహత్యా సహస్రస్య పాపం శామ్యేత్కథంచన |
వైశాఖే యేన నస్నాతం తత్పాపం నైవగచ్ఛతి ||

స్వాధీనేన స్వకాయేన జలే స్వాతంత్య్రవర్తిని |
స్వాధీనజిహ్వయోచ్చార్య హరిరిత్యక్షరద్వయమ్‌ ||

న కుర్యాద్యది వైశాఖే ప్రాత:స్నానం నరాధమ: |
జీవ న్నేవ సపంచత్వం ఆగతో నాత్రసంశయ: ||

వైశాఖ మాసమున కాంస్య పాత్రలో భుజించువారు, సత్కథలు వినవివారు, స్నానము, దానము చేయక నుండువారికి నరకము ప్రాప్తించును. వేల వేల బ్రహ్మ హత్యలు చేసిన పాపము శమించును. వైశాఖములో నదీస్నానము చేయని వాని పాపము నశించనే నశించదు. స్వాధీనముగా నున్న తన శరీరముతో స్వతంత్య్రముగానున్న జలమున తన ఆధీనములో ఉన్న జిహ్వతో ‘హరి’ అను రెండక్షరములను పలుకుతూ వైశాఖమాస ప్రాత: కాలమున నదీ స్నానము చేయనిచో బ్రతికి ఉన్నా మరణించిన వారితో సమానము అనడంలో సందేహము లేదు.

- Advertisement -

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…

Advertisement

తాజా వార్తలు

Advertisement