Friday, November 22, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాస వైభవం-19 (ఆడియోతో)…

మధుసూదన పూజాచ కథాయా శ్శ్రవణం తథా |
అభ్యంగ వర్జనే చైవ తథావై పత్ర భోజనమ్‌ ||

మధ్యే మధ్యే శ్రమార్తానాం వీజనం వ్యజనేన చ |
సుగన్ధై: కోమలై: పుష్పై: ప్రత్యఙ్గం పూజనం హరే: ||

ఫలం దధ్యన్న నైవేద్యం ధూపదీపైర్దినే దినే |
గోగ్రాసం వృష పత్నీనాం ద్విజపాదావనే జనమ్‌ ||

గుడనాగరం దానం చ ధాత్రీ పిష్ట ప్రదాపనమ్‌ |
పథికానాం ప్రశ్రయంచ దానం తండుల శాకయో: |
ఏతే ధర్మా ప్రశస్తాహి వైశాఖే మాధవ ప్రియే ||

వైశాఖ మాసమున మధుసూదన భగవానుని పూజించుట, స్వామి కథను వినుట, అభ్యంగమును విడుచుట, విస్తరిలో భుజించుట, మధ్య మధ్యలో శ్రమతో ఆర్తులైనవారికి విసనకర్రతో వీచుటను, సుగంధములు కల కోమల పుష్పములతో శ్రీహరి ప్రత్యవయవమును పూజించుట, ఫలములను, దధ్యోదన నైవేద్యముతో ప్రతిదినము ధూప దీపములతో పూజించుట తప్పక చేయవలెను.

- Advertisement -

వృషభముల పత్నులైన గోవులకు గ్రాసమును దానము చేయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, గుడనాగర దానము, ధాత్ర పిష్ట ప్రదానము, బాటసారులకు వినయముతో ఆశ్రయమును కల్పించుట, తం డులములను శాకములను దానము చేయుట మాధవ వైశాఖమాసములలో ఇవి ప్రశస్తదానములుగా పేర్కొనబడినవి.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement