Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాస వైభవం-28 (ఆడియోతో)…

గోరోచం మృగనాభించ దద్యాద్వైశాఖ ధర్మవిత్‌ |
తాపత్రయ వినిర్ముక్త: పరం నిర్వాణ మృచ్ఛతి ||

తాంబూలం చ సకర్పూరం యోదద్యాన్మేష గేరవౌ |
సార్వభౌమ సుఖం భుక్త్వా పరం నిర్వాణ మృచ్ఛతి ||

శతపత్రీంచ యూధీం చ మేషమాసే దదన్నర: |
ససార్వభౌమో భవతి పవ్చన్మోక్షంచ విందతి ||

కేతకీం మల్లికాం వాపి యోదద్యాన్మాధవాగమే |
సతుమోక్ష మవాప్నోతి మధుశాసన శాసనాత్‌ ||

పూగీఫలంతు యోదద్యాత్సుగంధంతు ద్విజాతయే |
నారికేల ఫలం రాజన్‌ తస్య పుణ్యఫలం శృణు ||

- Advertisement -

సప్తజన్మ భవే ద్విప్ర: ధనాఢ్యో వేదపారగ: |
పశ్చాత్సప్త కులైర్యుక్తో విష్ణ ులోకం సగచ్ఛతి ||

గోరోచనమును, కస్తూరిని వైశాఖ ధర్మమును తెలిసినవారు దానము చేసినచో తాపత్రయ వినిర్ముక్తుడై ఉత్తమ నిర్వానమును చెందును. కర్పూరముతో కూడిన తాంబూలమును మేషరాశిలో రవి ఉన్నప్పుడు ఇచ్చినవాడు సార్వభౌమ సుఖమును పొంది బ్రహ్మ నిర్వాణమును చేరును. శతపత్రమును, కలువను మేషమాసమున ఇచ్చినచో సార్వభౌముడై తరువాత మోక్షమును పొందును. కేతకిని, మల్లెను మాధవమాసమున ఇచ్చినచో మధుశాసన వాసనము వలన మోక్షమును పొందును. బ్రాహ్మణునకు పూగీఫలము, సుగంధమును కలదానిని ఇచ్చినవాడు, అట్లే నారికేల ఫలమును ఇచ్చినచో అతను ఏడు జన్మలు విప్రుడుగా, ధనవంతునిగా, వేదపండితునిగా పుట్టును. ఆ తరువాత ఏడు తరములలో విష్ణ ులోకమును పొందే పుణ్య ఫలమును పొందును.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement