Friday, November 22, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాస వైభవం-27 (ఆడియోతో)…

తైలాభ్యంగం దివాస్వాపం తథావై కాంస్య భోజనమ్‌ |
ఖట్వనిద్రాం గృహే స్నానం నిషిద్ధం నీచభక్షణమ్‌ ||

వైశాఖే వర్జయే దష్టౌ ద్విభుక్తం నక్తభోజనమ్‌ |
పద్మపత్రేతు యో భుంక్తే వైశాఖే వ్రతసంస్థి త: ||

సతుపాప వినిర్ముక్త: విష్ణ ులోకం చ గచ్ఛతి |
వైశాఖే మాసి మధ్యాహ్నే శ్రాంతానాం తు ద్విజన్మనామ్‌ |
పాదావనే జనం కుర్యాత్‌ తద్వ్రతం సువ్రతోత్తమమ్‌ ||

తైలాభ్యంగము దివాస్వాపము, కాంస్యపాత్ర భోజనము, మంచముపై నిద్రించుట, ఇంటిలో స్నానము చేయుట, నిషేధించిన దానిని భుజించుట, రాత్రి భోజనము అను ఈ ఎనిమిదింటిని వైశాఖ మాసమున విడువవలయును. వైశాఖమాసమున వ్రతమున నున్నవాడు తామరాకులలో భుజించినచో పాపములు తొలగి విష్ణులోకమునకు వెళ్ళును. వైశాఖమాసమున మధ్యాహ్నమున అలసిన బ్రాహ్మణులకు పాదప్రక్షాలనము చేసినచో ఆ వ్రతము ఉత్తమ వ్రతములలో ఉత్తమమగును.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement