మాధవ: ప్రథమో మాస: శేష సాయి ప్రియస్సదా |
అత్ర తేన క్షిపేద్యస్తు మాసం మాధవ వల్లభమ్ ||
తిర్యగ్యోనిం సయాత్యాశు సర్వధర్మ బహిష ్కృత: |
అత్ర తేన గతో యేషాం మాధవో మర్త్య ధర్మిణామ్ ||
ఇష్టాపూర్తి వృధా తేషాం ధర్మో ధర్మ భృతాం వర |
ప్రవృత్తానాంతు భ క్ష్యాణాం మాధవే2 నియమేకృతే ||
అవశ్యం విష్ణు సాయుజ్యం ప్రాప్నోత్యేవ నసంశయ: |
సన్తీహ బహువిత్తాని వ్రతాని వివిధానిచ ||
దేహాయాసకరాణ్యవ పునర్జన్మ ప్రదానిచ |
వైశాఖ స్నాన మాత్రేణ న పునర్జాయతే భువి ||
నిరంతరం శేషశాయి ప్రియమైన మొదటి మాసము వైశాఖమాసము. మాధవ వల్లభమైన వైశాఖమాసమున నిందించినవాడు పశుజాతిలో పుట్టును, సర్వధర్మ బహిష్కృతుడవును. మానవ ధర్మములో ఉన్నవారు ఈ వైశాఖ మాసమున వ్రతాచరణ లేకుండా గడిపిన వారు చేసిన యగ్నయాగాదులు త్రవ్వించిన వాపీ కూప తటాకాదులుగా నున్న ధర్మములు వ్యర్థమగును. వైశాఖ మాసమున భక్ష్య విషయమున నియమమును పాటించనట్లయితే అన్ని ధర్మములు వ్యర్థమగును. ధర్మమును ఆచరించనట్లయితే తప్పక విష్ణ ు సాయుజ్యమును పొందవచ్చును. నానా విధములైన వ్రతములు బహువిత్త సాధ్యములు చాలా ఉన్నవి. అవన్నీ దేహాయాస కరములు పునర్జన్మ ప్రదములు కూడా. వైశాఖ స్నాన మంత్రముతో మరుజన్మ ఉండదు.
– శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి