స్కాంద పురాణంలో వైశాఖ మాస మహత ్మ్యం అను పేరుతో 25 అధ్యయములు సుమారు 1800 శ్లోకాలతో ఒక భాగము కలదు. వైశాఖ మాసములోని ప్రత్యేకతనను స్కాంద పురాణం ఈ విధంగా తెలిపింది. పూర్వము నారదుడు బ్రహ్మను అడగగా కార్తిక, మాఘ, మార్గశీర్ష మాసముల వైభవాన్ని చెప్పి వాటిలో విశిష్టమైన మాసం వైశాఖమాసమని వివరించెను.
న మాధవ సమో మాస: నకృతేన సమం యుగం
నచవేద సమం శాస్త్రం న తీర్ధయ గంగయాసమమ్
అని స్కాంద పురాణ వాక్యం. అనగా వై శాఖ మాసంతో సమానమైన మాసం కృత యుగంతో సమానమైన యుగం వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము మరొకటి లేదని శ్లోకార్థం.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి