Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : మన పుణ్యతీర్థము – త్రిదైవత్య తీర్థము (ఆడియోతో..)

త్రిదైవత్య తీర్థము స్వరూపము, బేధముగూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బ్రహ్మపురాణం, గౌతమీ ఖండంలో సర్వోత్తమమైన త్రిదైవత్య తీర్థము స్వరూపము, బేధము గూర్చి బ్రహ్మదేవుడు వశిష్ఠాది మహర్షులకు
ఈ విధంగా వివరించెను.

త్రిమూర్తులచే నిర్మించబడిన తీర్థము(నది)ను ‘త్రిదైవత్య తీర్థమ’ని అంటారు. అన్ని నదులలో శ్రేష్టమైనవి సర్వకామప్రదాయిని అయిన గంగా నదియే ‘త్రిదైవత్య’ తీర్థం. ఈ ‘త్రిదైవత్య’తీర్థములోనే అన్ని యజ్ఞములు, దానములు, పుణ్యకార్యములు, తపస్సులు, పుణ్య తీర్థములు అంతర్భవించును. ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, మాతృశుద్ధి, పితృశుద్ధి, వంశ శుద్ధి, మనస్సుద్ధి, బుద్ధి శుద్ధి, అంతరాత్మ శుద్ధి ఈ అష్టశుద్ధులు ‘త్రిదైవత్య’ తీర్థ సేవనంలో కలుగును. ఏ ఇతర తీర్థము సర్వపాపహారము కాదు. ఈ తీర్థమును స్మరించినా, చూసినా, స్పృశించినా అన్ని పాపములు తొలగును.

‘వ్రతోపవాస కృచ్ఛ్రేభ్య: గంగాసేవా మహాఫలా’ అనగా అన్ని కృచ్ఛ్ర వ్రతమలు, ఉపవాసముల కంటే గంగా నది సేవ గొప్ప ఫలాన్నిస్తుందని శ్లోకార్థం.

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement