చతుర్థి సహితా యాతు సా తృతీయా ఫలప్రదా
అవైధవ్య కరీస్త్రీణాం పుత్రపౌత్ర ప్రవర్ధినీ
భాద్రపద శుక్ల తృతీయ చతుర్థితో కలిసి వచ్చినపుడు అధిక ఫలాన్నిస్తుంది. ఈ తృతీయను విదియతో కలిసి ఉన్నచో ఆచరించరాదు. స్త్రీలు ఈ వ్రతమును ఆచరించినచో భర్తృవియోగం పొందరు. పుత్రపౌత్రులతో వంశాభివృద్ధి కలుగును. ఈరోజున ‘హరితాలికా వ్రతము’ అనగా గౌరీవ్రతమును ఆచరించవలెను. మరునాడు అనగా భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి కావున తృతీయ నాడు గౌరీని ఆరాధించి చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధించవలెను. ఈ తృతీయను హరితాలికా అని భాద్రపద బహుళ తృతీయను మధుశ్రావణిక అని అంటారు. అలాగే శ్రావణ శుక్ల తృతీయను కూడా మధుశ్రావణిక అని అంటారు. భాద్రపద బహుళ తృతీయను కజ్జలి (కాటుక) అని కూడ వ్యవహరిస్తారు. ఆరోజు స్వయంగా కాటుకను సిద్ధం చేసి లక్ష్మీనారాయణులకు లేదా పార్వతీపరమేశ్వరులకు ఆ కాటుకను సమర్పించి తరువాత తమ కన్నులకు పెట్టుకుంటే నేత్ర సంబంధమైన సమస్యలు రావు. స్త్రీలు నిరంతరం భర్త అనురాగాన్ని పొందెదరు.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి