Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : భాద్రపద శుక్ల సప్తమి (ఆడియోతో…)

భాద్రపద మాస కర్తవ్యాల గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భాద్రపద శుక్ల సప్తమి నాడు ముక్తాభరణ వ్రతం ఆచరించాలి. దీనిని ముక్తాభరణ సప్తమిగా కూడా వ్యవహరిస్తారు. ఈనాడు ముత్యాలతో ఆభరణములు చేసుకొని శక్తి కలవారు ముత్యములతో లక్ష్మీనారాయణుల ప్రతిమలను తయారుచేసి ఆవు పాలతో అభిషేకం నిర్వహించి షోడశోపచార పూజ చేయాలి. అనంతరం ఆ ప్రతిమలకు ముత్యాలతో కూడిన దుస్తులతో మరియు ముత్యాల ఆభరణాలతో అలకరింపచేసి సప్త ఋషులను పూజించి విశేషించి సూర్య భగవానుని ఆరాధించవలెను. ఏడుగురు బ్రాహ్మణులకు శక్తి కొలదీ ముత్యములు, ఆభరణాలు ఇచ్చి వారికి భోజనము మరియు దక్షిణతాంబూలాలు సమర్పించి వారి అనుమతితో ముత్యాల ఆభరణాలు ధరించి దేవాలయానికి వెళ్లవలెను. స్వామిని దర్శించి ప్రదక్షిణ చేసి నైవేధ్యం తీసుకుని శక్తిఉన్నవారు రాత్రి జాగరణ చేసి సూర్యోదయంతో ఈ వ్రతమును పూర్తి చేయవలెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement