Sunday, November 17, 2024

ధర్మం – మర్మం : పాణిగ్రహణం (ఆడియోతో..)

పాణిగ్రహం పదంలో అంతరార్థం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

పాణిగ్రహం కాదు పాణిగ్రహణం. గ్రహణం అంటే తీసుకొనుట , స్వీకరించుట, ప ట్టుకొనుట అని అర్థం. పాణిగ్రహణం అంటే చేయిని పట్టుకొనుట. కన్య కుడి హస్తాన్ని వరుడు కుడి హస్తంతో పట్టుకోవటం పాణిగ్రహణం. అసలు వివాహమంటే ఇదే. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, పాదపీడనం, తలంబ్రాలు ఇవన్నీ కాదు, అవన్నీ ఆనుషంగికాలు. పాణిగ్రహణాన్ని వివాహ ముహూర్తంలో చేయాలి. అందుకే రామయణంలో జనక మహారాజు ”ఇయం సీతా మమసుతా సహధర్మ చరీ చవ | ప్రతిచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృష్ణీష్‌వ పానినా|| ” అని రామునితో అంటాడు. పాణిగ్రహణం అంటే వివాహం, కన్యాదానం చేయాలి. దానం చేయటం అంటే చేతిలో విడువాలి కదా కన్య చేతిని వరుని చేతిలో కన్నతండ్రి ఇస్తే వరుడు తీసుకుంటాడు. ఇది ముహూర్తంలో జరగాలి కానీ ఈనాటి కాలంలో పురోహితులు జీలకర్ర బెల్లానికి ఇచ్చిన ప్రాధాన్యం పాణిగ్రహణానికి ఈయుట లేదనే విషయం తెలుసుకోవాలి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement