పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కం దాడై రామానుజాచార్యుల వారి వివరణ…
4.
మనసశ్చా జయాత్ లోభాత్ దంభాత్ పాశండ సంశ్రయాత్
శాస్త్రాన భ్యసనా చ్చైవ ధ్యాన యోగ ఫలం గతమ్
ఈనాటి కాలంలో ధ్యానము కూడా సార హీనమైనది. శాస్త్రవిధిని అనుసరించి శ్రద్ధా భక్తులతో ఏకాగ్రమైన దేవతా సాక్షాత్కారం కలగాలి లేద ంటే మంత్ర సిద్ధి ,ధ్యాన సిద్ధి కలగాలి కాని కలగడం లేదని కలియుగంలో జరుగుతున్న లోపాలను వాటి ప్రభావాన్ని నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు.
మొదటి లోపం మనస్సును జయించకపోవడం, ఏ దేవతను ధ్యానం చేస్తున్నామో మనస్సు ఆ దేవత పైనే ఉండాలి. మనసు మన దగ్గర లేకుంటే మన చుట్టూ ఏమి జరిగినా, మనకు ఏమి జరిగినా తెలియదు. ఆనాడు పరీక్షిత్తు ఋషి మెడలో పాము వేసినా తెలియకపోవడం ఇలాంటి ధ్యానములోనే అంటే ధ్యానం ఫలించాలంటే మనసును జయించాలి.
రెండవది కోరికలు తీర్చుకోవడం మీద దృష్టి ఉంచరాదు. భగవంతుని భగవంతునిగా సేవిం చాలి కానీ కోరికలు తీర్చేవాడుగా ధ్యానించరాదు. కోరికలు పెట్టుకొని ధ్యానం చేస్తే మన మనసు కోరిక పై కాని భగవంతుని పై ఉండదు. ఇది కూడ ధ్యానం ఫలించకపోవడానికి కారణం.
ఇక మూడవది. కొందరు మహానుభావులు తాము ధ్యానం చేస్తున్నట్లు పదిమంది గుర్తించాలి అని పది మంది చూపులు పడేలా ధ్యానం చేస్తునట్లు నటిస్తారు దీనిని దంభము అంటారు. అంతా కపటమని అర్థం, కపట ధ్యానం పనిచేయదు.
ఇక నాల్గవది ధ్యానం చేసే వారు తాము పవిత్రంగా ఉండి ధ్యానం చేసే ప్రదేశాన్ని పవిత్ర ంగా ఉంచి, ఆ చుట్టు ప్రక్కల ఉండేవారు కూడా పవిత్రులుగా ఉన్నపుడే మన మనస్సు మన ధ్యానం పవిత్రమై ఫలి స్తుంది. పాపపు ఆలోచనలు ఉన్నా, పాపం చేసిన వారు, చేస్తున్న వారు మన చుట్టూ ఉన్నా వారి దగ్గర మనం ఉన్నా ధ్యానం ఫలించదు.
ఇక ఐదవది శాస్త్రాభ్యాసం. శాస్త్రమును గురు ముఖత: సక్రమంగా అభ్యసించి అభ్యసించిన దానిని అర్థం చేసుకొని శాస్త్ర విధిని అనుసరించే చేసినపుడే ధ్యానం ఫలిస్తుంది. కాని కలియుగంలో శాస్త్రాభ్యాసం లేకుండానే ధ్యానం చేస్తున్న వారు, చేయిస్తున్నవారు ఉన్నారు కావున ధ్యానం లోని సారం కూడా పోయింది.
ఇలా ధ్యానం సారహీనం, కావడానికి అంటే ఫలమునీయక పోవడానికి మన్సును జయించక పోవుట, కోరికలు మీద ఆశ పెంచుకొనుట, దంభమును ఆశ్రయించుట, పాపులతో సహవాసం చేయుట, శాస్త్రాభ్యాసం చేయకపోవుట కారణములని పద్మ పురాణం ద్వారా తెలుస్తోంది. ఇవి లేకుండా చేసిన ధ్యానం ఫలిస్తుందని ఋషిహృదయం.
–శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి