Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : ధాత్రీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా ధాత్రీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

సర్వదేవ మయీ ధాత్రీ విశేషాత్‌ కేశవప్రియా
సమ్యక్‌ వక్తుం గుణం తస్యా: బ్రహ్మణ: న సక్యతే
ధాత్య్రా: తులస్యా: విదధాతి భక్తిమ్‌ యో మానవ: జ్ఞాత సమస్త తత్త్వ:
భుక్త్వా చ భోగాన్‌ సకలాన్‌ తతోంతే సముక్తి మాప్నోతి హరే: ప్రసాదాత్‌

ధాత్రీ వృక్షము సర్వదేవతా స్వరూపము. విశేషించి శ్రీహరికి ప్రియతమరాలు. ధాత్రీ వృక్షము యొక్క ప్రభావమును పరిపూర్ణముగా బ్రహ్మ కూడా చెప్పజాలడు. ధాత్రీ వృక్షము, తులసీ వృక్షము నందు భక్తి కలిగి ఉన్నవాడు సకల తత్త్వ జ్ఞానము కలవాడగును. ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున శ్రీహరి అనుగ్రహముతో ముక్తిని పొందును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement