Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : ధాత్రీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా ధాత్రీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ధాత్రీ ఫలస్రజం యస్తు పాపం హర్తుం వహేత్‌బుధ:
తస్యాశ్రిత్య తనుంవిష్ణు: సదా తిష్ఠేత్‌ శ్రియసహ
ధాత్రీ కాష్టస్య మాలాంచ ధారయన్‌ మతిమాన్‌ నర:
తస్య దేహం సమాశ్రిత్య తిష్ఠంతి సర్వ దేవతా:
ధాత్రీ ఫల స్రజం గృహ్ణన్‌ యత్కర్మ కురుతే నర:
తత్సర్వ మక్షయం ప్రోక్తమ్‌ శుభం వాయదివాశుభం

సకల పాపములను హరించు ధాత్రీ ఫలముల మాలను ధరించిన వారి శరీరమును ఆశ్రయించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో నివసించును. బుద్ధిమంతుడైన మానవుడు ధాత్రీ కాష్టము(చెట్టు)తో చేసిన జపమాలను స్వీకరించి చేసిన ప్రతీ పని అక్షయమగును. అతని దేహమును ఆశ్రయించి దేవతలందరూ నివసింతురు. అఖిల తత్త్వమును తెలిసిన వాడు ధాత్రీ ఫలమును భుజించినచో అతని దేహమున ఉన్న పాపములు అన్నీ నశించును. ధాత్రీఫలములతో తయారుచేసిన మాలను బ్రాహ్మణునికి దానము చేసినచో సకల పాపములు హరించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement