Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ధాత్రీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా ధాత్రీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ధాత్రీచ తులసీ దేవీ నతిష్ఠేత్‌ యత్ర జైమినే
స్థానం తద పవిత్రంస్యాత్‌ నచ క్రియా ఫలం లభేత్‌
నతిష్ఠత్యాశ్రమే యస్య ధాత్రీచ తులసీ శుభా
తేన కర్మ కృతం సర్వం నూనం భవతి నిష్ఫలం
ధాత్య్రా తులస్యా హీనంచ నిలయం యస్య భూసుర
అలక్ష్మీ: పాతకం సర్వం కలిశ్చ తేన తోషిత:
స్థానే యత్ర ద్విజశ్రేష్ఠ నధాత్రీ తులసీ న చ
స్మశాన తుల్యం స్థానం తత్‌ విజ్ఞేయం తత్త్వ దర్శిభి:
ధాత్రీచ తులసీ యత్ర తిష్ఠేత్‌ తత్రాఖిలా సురా:
న ధాత్రీ తులసీ యత్ర తత్రైవాఖిల పాతకం

ధాత్రీ వృక్షము, తులసీ వృక్షము లేని ప్రదేశములు అపవిత్రమైనవి. అక్కడ చేసిన పనులన్నీ ఫలవంతములు కావు. ధాత్రీ, తులసీ లేని ఆశ్రమంలో చేసిన అన్ని కర్మలు వ్యర్థములగును. ధాత్రీ మరియు తులసీ వృక్షము లేని ఇల్లు దారిద్య్రానికి, పాతకానికి, కలి (కలి పురుషుడు)కి సంతోషము కలిగించును. తులసీ వృక్షము, ధాత్రీ వృక్షము లేని ప్రదేశము స్మశానముతో సమానమని తెలియవలెను. ధాత్రీ వృక్షము, తులసీ వృక్షము ఉన్న ప్రదేశంలో సకల దేవతలు కొలువై ఉందురు. ధాత్రీ, తులసీ లేని చోట సకల పాతకములుండును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement