Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ధాత్రీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా ధాత్రీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యధా ప్రియతమం విష్ణో: తులసీ సతతం ద్విజ
తధా ప్రియతమా ధాత్రీ సర్వ పాప ప్రణాశిని
తులసీ వృక్ష మాసాధ్య యాయా: తిష్ఠంతి దేవతా:
ఆమలఖ్యాస ్తలే తాస్తా: నివసంతి ద్విజోత్తమ
గంగాదీ నీచ తీర్థాని తత్రైవ ద్విజ సత్తమ
విష్ణు ప్రియతమా ధాత్రీ పవిత్రా యత్ర తిష్ఠతి
అశుభం వాశుభం వాపి యత్కర్మ ఆమలకీ తలే
క్రియతే మానవై: విప్ర భవేత్‌ తత్‌ సత్యం మక్షయమ్‌
పవిత్రై: నూతనై: పత్రై: ధాత్య్రా య: పూజయేత్‌ హరిం
సముక్త: పాప జాలేన సాయుజ్యం లభతే నర:

బ్రాహ్మణోత్తమా! శ్రీమహావిష్ణువుకు తులసి ఎలా ప్రియతమురాలో సకల పాపములను నశింపచేయు ధాత్రి కూడా అంతే ప్రియతమరాలు. తులసీ వృక్షమును ఆశ్రయించిన దేవతలందరూ ధాత్రీ వృక్షమును కూడా ఆశ్రయించి ఉందురు. పవిత్రమైన విష్ణుప్రియ అయిన ధాత్రీ ఉన్నచోట గంగాది సకల తీర్థములు ఉండును. ధాత్రీ వృక్షము వద్ద మానవులు చేసిన శుభాశుభ కర్మలు ఏవైనా అక్షయము, సత్యము అగును. పవిత్రములైన ధాత్రీ నూతన పత్రములతో శ్రీహరిని పూజించినచో సకల పాపములు తొలగించుకుని శ్రీహరి సాయుజ్యమును పొందుదురు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement