Friday, November 22, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఇంద్రాది దేవతలు చేత భగవతి అయిన తులసి నిరంతరం సేవించదగినది. ఆ విధంగా సేవించినచో చతుర్వర్గ ఫలమును ప్రసాదించును. స్వర్గలోకమున, మర్త్య లోకమున, పాతాళ లోకమున కూడా తులసి దుర్లభమైనది. తులసి యందు భక్తి కలవారికి ధర్మార్థ కామ మోక్షములు లభించునని పద్మపురాణం ఉత్తరకాండం, ఉత్తరార్ధంలో క్రియాయోగ సారకాండంలో తులసి వైభవంలో వివరించబడినది.

యత్రైక: తులసీ వృక్ష: తిష్టత్యపిచ సత్తమ
తత్రైవ త్రిదశా: సర్వే బ్రహ్మ వి ష్ణు శివాదయ:
కేశవ: పత్ర మధ్యేచ పత్రాగ్రేచ ప్రజాపతి:
పత్రవృంతే శివస్తిష్ఠేత్‌ తులస్యా: సర్వదైవహి

ఎక్కడైతే తులసీ వృక్షమున్నదో అక్కడే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఇతర దేవతలందరూ కొలువై యుందురు. తులసీ పత్ర మధ్యమున శ్రీమహావిష్ణువు, అగ్రభాగమున ప్రజాపతి, పత్రము యొక్క కాడలో శివుడు సర్వదా నివసింతురు. ఈ విధంగా తులసి ఎక్కడున్నా అక్కడ సకల దేవతలు కొలువై ఉందురు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement