Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

పత్రం పుష్పం ఫలం మూలం శాఖా త్వక్‌ స్కంద సంజ్ఞితమ్‌
తులసీ సంభవం సర్వం పావనం మృత్తికాదికం
శరీరం దహ్యతే యేషాం తులసీ కాష్ఠవహ్నినా
దత్వాచ తులసీ కాష్టం సర్వాంగేషు మృతస్య వై
పశ్చాత్‌ య: కురుతే దాహం సోపి పాపాత్‌ ప్ర ముచ్యతే
మరణయస్య సంప్రాప్తం కీర్తనం స్మరణం హరే:
తులసీ దారుణా దాహ: న తస్య పునరావృత్తి:
యద్యేకం తులసీ కాష్టం మధ్యే కాష్ట శతస్యహి
దాహకాలే భవేన్ముక్తి: కోటి పాప యుతస్య చ

తులసీ పత్రము, తులసీ పుష్పము, తులసీ ఫలము, తులసీ మూలము, తులసీ శాఖ, తులసీ బెరడు, స్కందము ఇట్లు తులసీ వలన ఏర్పడినవన్నీ తులసీ మూల మృత్తికలతో సహా పావనములే. తులసీ కాష్టములతో చేసిన అగ్నితో శరీరమును దహింపచేసి నా అలాగే మరణించిన వాని అవయవములలో తులసీ కాష్టమును ఉంచి దహనము చేసినచో అతడు సకల పాపముల నుండి విముక్తుడగును. మరణించే ముందు శ్రీహరి నామ సంకీర్తనను, మరణించిన తర్వాత తులసీ కాష్టముతో దహించిన వానికి పునర్జన్మ ఉండదు. కట్టెల మధ్య ఒక తులసీ కాష్టమును ఉంచి దహింప చేసినచో అతడు కోటి పాపములు కలవాడైననూ ముక్తిని పొందును. గంగాజలముతో అభిషేకము చేసినచో పుణ్యములే పుణ్యములగును. తులసీ కాష్టముతో కలిసిన ఇతర కట్టెలు కూడా పుణ్యములగును. తులసీ కాష్టముతో కలిసి ఉన్న చితి మండుతున్నంత వరకు కోటి కల్పములలో చేసిన పాపములు కూడా దహింపబడును. తులసీ కాష్ట దహనము పొందిన వారిని విష్ణు దూతలు తీసుకొని పోవుదురు. అతని వద్దకు యమదూతలు రారు. వేల కోట్ల జన్మలలో చేసిన పాపములు కూడా పోయి పరమాత్మను చేరెదరు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement