Friday, November 22, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఇంద్రాది దేవతలు చేత భగవతి అయిన తులసి నిరంతరం సేవించదగినది. ఆ విధంగా సేవించినచో చతుర్వర్గ ఫలమును ప్రసాదించును. స్వర్గలోకమున, మర్త్య లోకమున, పాతాళ లోకమున కూడా తులసి దుర్లభమైనది. తులసి యందు భక్తి కలవారికి ధర్మార్థ కామ మోక్షములు లభించునని పద్మపురాణం ఉత్తరకాండం, ఉత్తరార్ధంలో క్రియాయోగ సారకాండంలో తులసి వైభవంలో వివరించబడినది.

శాఖాగ్రాత్‌ పతితం భూమౌ పత్రం పత్రం పురాతన ం
తేనాపి పూజ్యో గోవింద: మధు కైటభ మర్దన:
కోమలై: తులసీ పత్రై: యోర్చయోత్‌ అచ్యుతం ప్రభుమ్‌
సర్వం సలభతే శ్రీఘ్రం యద్య దిచ్ఛతి చేతసా

తులసి కొమ్మ నుండి రాలి భూమి మీద పడిన. వాడిపోయిన, ఎండిపోయిన, చాలా కాలం క్రితం నాటి ఆకు అయిననూ కోమలమైన తులసి లభించనపుడు ఆ ఆకులతో కూడా శ్రీమన్నారాయణుని పూజించవచ్చును. కోమలమైన తులసీ పత్రములతో శ్రీమన్నారాయణుని పూజించిన నాడు తన మనస్సులో కోరిన దానిని అంతటిని పొందును.

తులసీ వృక్షం లేదా తులసీ పత్రం లభించనపుడు తులసీ వృక్షముతో సమానమైన వృక్షము మరొకటి ఏదైనా ఉందా అని జైమినీ మహర్షి వ్యాసుడిని అడుగగా ధాత్రీ వృక్షము తులసీ వృక్షమునకు సరిసమానమని సమాధానమిచ్చెను.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement