శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
శ్రీకృష్ణునకు తులసీ కాష్ట చందనాన్ని లేపనము చేయుటకు కృష్ణ మందిరంలో ఎంత సమయం వెచ్చిస్తే ప్రతీ నిమిషానికి వేయి యాగములు చేసిన ఫలము లభించును. తులసీ కాష్ట చందనమును పట్టుకుని శ్రీహరి ఆలయంలో నిలిచినచో ఎనిమిది పుట్లు(64 క్వింటాళ్ళు, ఒక పుట్టు అనగా ఎనిమిది క్వింటాళ్ళు) నువ్వులు దానం చేసిన ఫలం కలుగును. పితృదేవతలకు పిండ ప్రదానం చేసినపుడు ఆ పిండములపై తులసీ దలమును ఉంచినచో ఒక్కొక్క దలమునకు నూరు ఆబ్ధికములు చేసిన ఫలము లభించును. తులసీ వృక్ష మూలములో ఉన్న మట్టిని ఒంటికి రాసుకుని విశేషంగా స్నానం చేసినచో కోటి గంగా స్నాన ఫలములు లభించును. శరీరమున తులసీ మృత్తిక ఎంతవరకు ఉండునో ఆ మృత్తికలో ఎన్ని మట్టి కణాలుండునో అన్ని వేల యుగాలు శ్రీహరి లోకమున అతను నివసించును. తులసీ మంజరితో శ్రీహరిని పూజించనచో కొన్ని కోట్ల పుష్పములతో సూర్యచంద్రులకు పూజ చేసిన ఫలము లభించును. తులసీ వృక్షముల తోట ఉన్న నివాసము కోటి పుణ్య తీర్థములతో సమానమైనది . అటువంటి నివాసమును చూసినా, స్పృశించినా కోటి పుష్పములతో శ్రీహరిని పూజించిన ఫలము లభించును. తులసీ వనమును దర్శించినా, స్పృశించినా బ్రహ్మహత్యపాతకములు నశించును.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి