Friday, November 22, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో..)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మంజర్యాం వసతే రుద్ర: తులసీ తేన పావనీ
వినా యస్తులసీం కుర్యాత్‌ సంధ్యా కాలేతు మార్జనమ్‌
తత్సర్వం రాక్షసహృతం నరకం చ ప్రయచ్ఛతి
తులసీ పత్ర గలితం తోయం య: శిరసావహేత్‌
గంగాఫల మవాప్నోతి శత ధేను ఫలం లభేత్‌

తులసీ మంజ రి యందు రుద్రుడు నివసించును కావున తులసీ పావనమైనది. సంధ్యాకాలమున చేసుకొను మార్జనము(మంత్రపూత జలమును శిరమును చల్లకొనుట) తులసీ పత్రము లేకుండా చేసినచో ఆ పుణ్య కర్మను రాక్షసులు హరింతురు. ఆ విధంగా చేసిన వారు నరకమును పొందెదరు. తులసీ పత్రము నుండి జారిన జలమును శిరమున దాల్చినచో గంగాస్నాన ఫలము, శతధేను(100 దూడతో కూడిన ఆవులు) దాన ఫలము లభించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement