శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
ఉత్పాతాన్ దారుణాన్ రోగాన్ దుర్నిమిత్తాన్యనే కశ:
తులస్యా భ్యర్చితో భక్త్యా హంతి శాంతికరో హరి:
తులసీ గంధం ఆఘ్రాయ యత్ర గచ్ఛతి మారుత:
దిశో దశ చ పూతా: భూత గ్రామ: చతుర్విధ:
యస్మిన్ గృహేముని శ్రేష్ఠ తులసీ మూల మృత్తికా
సర్వదాతత్ర తిష్ఠంతి దేవతాశ్చ శివో హరి:
తులసీ వనజా ఛాయా యత్ర యత్ర భవేద్విజ
తర్పణం కురుతే యత్ర పితౄణాం దత్త మక్షయం
తస్య మూలే స్థితో బ్రహ్మా మధ్యే దేవో జనార్ధన:
దారుణమైన ఉత్పాతములను, రోగములను అనేక దుర్నిమిత్తములను తులసీతో అర్చించబడినచో శ్రీహరి శాంతింపచేయును. తులసీ గంధమును స్వీకరించిన వాయువు పయనించిన పలు దిక్కులు మరియు నాలుగు విధములైన ప్రాణులు (అనగా మావి నుండి పుట్టినవారు, గుడ్డు నుండి పుట్టినవారు, చెమట నుండి పుట్టినవి, భూమిని పెకిలించుకుని పుట్టినవి ఇవి నాలుగు విధములైన ప్రాణులు) కూడా పవిత్రములగును. తులసీ మూల మృత్తిక ఉన్న ఇంటిలో అన్ని వేళ్లల్లో దేవతలు, శివుడు, శ్రీహరి నివసింతురు. తులసీ వనమున, తులసీ నీడ ఉన్నచోట, పితృదేవతలకు పితృతర్పణము విడిచినచో అది అక్షయమగును. ఆ తులసీ వనములో మూల మున బ్రహ్మ, మధ్యలో నారాయణుడు, అగ్రభాగమున శివడు నివసించును.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి