Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో..)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

జ్వలతే యత్ర చాజ్యేన తులసీ కాష్ట పావక:
అగ్న్యా గారే స్మశానేవా దహ్యతే పాతకం నృణాం
హోమం కుర్వంతి యే విప్రా: తులసీ కాష్ట వహ్నినా
సిక్థే సిక్థే తిలే వాపి అగ్నిష్టోమ ఫలం లభేత్‌

తులసీ కాష్టముతో ఉన్న అగ్నిని నేతితో దహింప చేసినవాడు అది యజ్ఞశాల అయినా లేక స్మశానమైనా వారి పాతకము దహించబడును. తులసీ కాష్ట అగ్నిహోత్రంతో బ్రాహ్మణుడు హోమం చేసినచో ప్రతీ ఆద్యబిందువులోనూ, ప్రతీ నువ్వు గింజలోనూ వారికి అగ్నిష్టోమ యాగ ఫలము లభించును.

తులసీ కాష్ట వహ్ని(అగ్ని)తో దహనం చేయబడ్డ నరుల మీద పైనున్న దేవతలు పుష్పాంజలిని సమర్పించెదరు. అప్సరసలు నృత్యం, గాయకులు గానం
చేసెదరు. అటువంటి నరుని చూసిన శ్రీమహావిష్ణువు శంకరునితో కూడి సంతసించును. ఆ పుణ్యాత్ముని శ్రీహరి తన చేతిలోనికి తీసుకొని తన లోకమునకు తీసుకునిపోయి దేవతలందరి సమక్షంలో తన చేతితో అతనిని తడుముతూ పాపములను తుడిచివేయును. జయజయ శబ్ధములను పలికించుచూ గొప్ప ఉత్సవమును చేయుంచును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement