Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : చైత్ర శుద్ధ అష్టమి (ఆడియోతో…)

శ్రీరామనవరాత్రులలో చైత్రశుద్ధ అష్టమి ప్రాశస్త్యం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

చైత్ర శుద్ధ అష్టమి నాడు భవానీ యాత్ర చేయవలెనని స్కాంధమున కాశీ ఖండమున చెప్పబడినది.

భవానీ యస్తు పశ్యేత శుక్లాష్ట మ్యాం తిధౌనర:
న జాతు శోకంలభతే సదానన్ద మయో భవేత్‌

చైత్ర శుక్ల అష్టమినాడు భవానీని దర్శించిన వాడు ఎన్నడూ శోకమును పొందడు. అన్ని వేళలా అనందంగా ఉంటాడు.

అశోక కలికాశ్చేష్టే యే పిబంతి పునర్వసౌ
చైత్రేమాసి సితా ష్టమ్యాం నతే శోకమవాప్నుయు:

- Advertisement -

చైత్ర శుక్ల అష్టమినాడు పునర్వసు నక్షత్ర యోగమున్నచో ఎనిమిది అశోక వృక్షపు చివురుల రసమును త్రాగినచో వారు ఎన్నడూ శోకమును పొందరు.
పునర్వసు బుధోపేతా చైత్రేమాసి సితాష్టమీ
ప్రాతస్తు విధివత్‌ స్నాత్వావా జపేయ ఫలం లభేత్‌

పునర్వసు నక్షత్రం బుధవారముతో కూడిన చైత్ర శుద్ధ అష్టమినాడు ప్రాత: కాలమున యథావిధిగా స్నానము చేసినచో వాజపేయ ఫలము లభించును. ఇక కాలికా పురాణానుసారం చైత్ర శుక్లాష్టమినాడు ఇంద్రియానిగ్రహము కలిగి, ఎర్రని నీరులో అనగా సూర్య కిరణ కాంతిలో సంధ్యా కాలమున ఎర్ర బారిన నీటిలో స్నానము చేసినచో బ్రహ్మ పదమును పొందును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement