Saturday, November 23, 2024

ధర్మం-మర్మం.. గణపతి వృత్తాంతం(ఆడియోతో..)

గణపతి వృత్తాంతంలోని ధర్మ సూక్ష్మాలు గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

ఏనుగు ఆకారంలో ఉన్న రాక్షసుడు శంకరున్ని కడుపులో ఉంచుకున్నాడు. అదే ఏనుగు శిరస్సు బాలుడికి శిరస్సు అయింది. ఆ ఏనుగు తలలోని ఒక దంతం మూషికాలుసురుడిని సంహరించింది. ఈ కథలో బాలుడు రెండు సార్లు మరణించి మరల జన్మించాడు. ఒకసారి మరణిస్తే ఏనుగు శిరస్సు, మరొకసారి మరణిస్తే అనేకమైన సిద్ధులు, బుద్ధులు ప్రాప్తించాయి. ఒక తల్లి నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోస్తే తండ్రి ప్రాణం తీశాడు. తల్లి ప్రార్థిస్తే శిరస్సును మార్చాడు. ఈ కథలో అనేక సందేహాలు ఉన్నాయి.

జంతువులలో పెద్ద ఆకారం కలది ఏనుగు. ఏనుగును శాస్త్రం దైవముగా, రాక్షసముగా చెపుతుంది. ఏనుగు శుభ్రంగా స్నానం చేసి ఒడ్డుకు వచ్చి మళ్ళీ నెత్తిన మట్టి పోసుకుంటుంది. మావటివాడు చెప్పినట్టు వింటుంది. సకల లోకాలకు రక్షణ ఇచ్చే పరమాత్మను తన ఒక్కనిలోనే దాచుకోవాలి అనే కోరిక రాక్షసత్వం. అందుకే మళ్ళీ ఆ పరమేశ్వరుని లోకానికి ఇస్తే స్వార్థమైన ఆలోచన మాని లోకోపకారాన్ని కోరే ఆలోచనకు ఆ
శిరస్సు బాలునుకి చేరి లోకారాధ్యం అయింది. స్వార్థం, రాక్షసత్వం, పరార్థం, దైవత్వం అనే నీతి గజానన చరిత్రలో ఉంది.

మన శరీరమే గణపతి అనే విషయాన్ని సూచించడానికి పార్వతి తన వంటి మట్టితో బొమ్మను చేసి ప్రాణం పోసింది. మనందరి శరీరం మట్టే, మట్టికి ప్రాణం పోసేది తల్లె. ప్రాణం పోసిన బొమ్మకు తల మార్చేది తల తొలగించేది తండ్రే. తల అంటే ఆలోచనలకు నిలయం. పెద్దలను ధిక్కరించే తలను తీసేసి పెద్దలను గౌరవించే తలను చేర్చారు. అహంకారిన్ని తొలగించి వినయాన్ని అందించాడు. తండ్రి హితాన్ని కలిగిస్తాడు, వినయం వచ్చిన కుమారునికి మాతా పితృల భక్తిని, దైవ భక్తిని, గాణపత్యం మిషతో అందించాడు. అది కూడా మూషికాసురుడిని సంహరించిన తరువాతనే.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement