Monday, November 25, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసములో నదీ స్నాన విధానం (ఆడియోతో…)

కార్తిక మాసములో నదీ స్నాన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

కార్తిక మాసము నదీ స్నానానికి పెట్టింది పేరు. ‘ఆమలకం తధా నింబం తులసీ అర్క పత్రం వటం, ఆశ్వద్ధ, జంబూ పత్రంచ సప్తైతే కార్తీకే మోక్షదా: శుభా: ‘ అని పద్మ పురాణ వాక్యం. అమలకంతో మొదలు పెట్టి అల్లనెరేడుతో కార్తిక స్నానాన్ని ముగించాలి. ఈ ఏడు పత్రాలు లభిస్తే రోజు నీటిలో వేసుకొని స్నానం చేయాలి లేదా ఈ చెట్లలో రెండు మూడు చెట్లైనా ఒడ్డున ఉండే నదిలో స్నానం చేయాలి. నదుల తీరంలో ఆ చెట్లు లేకుంటే ఆ నదిలో ఉసిరి కాయ, అల్లనేరేడు పండు, తులసీ దళం లాంటివి వేసి మనతోపాటు స్నానం ఆచరించే వారందరికి పుణ్యం కలిగించాలి. ఈ మాసంలో మూడు పూటల స్నానం చేయడం విశేషం.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement