Sunday, November 24, 2024

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -15 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

15.
ఇక్షూణామపి మధ్యాంతం శర్కరా వ్యాప్య తిష్టతి
పృగద్భూతాచ సామిష్టా తధా భాగవతీ కధా

చెరుకులో కూడ గడ మొదట, మధ్యలో చివరలో అంతటా శర్కరే నిలిచి ఉంటుంది. అలా అని పాలలో, నీళ్లలో శర్కర బదులు చెరుకు ముక్క వేసుకుంటే మనం అనుకున్న రుచి దక్కుతుందా. మూలాన్ని పిప్పి చేసి రసాన్ని శర్కర గా చేసి ఆ శర్కరను వాడితేనే లడ్డూలు వంటి మధుర పదార్థాలు తయారవుతాయి. చెరుకు గడ దంచి లడ్డూ చేయలేము కదా. మూలం కంటే సారమే ఫలదాయకం. అలాగే వేద శాస్త్ర పురాణాల కంటే వాటి సారమైన భాగవతమే ముక్తి దాయకమని ఇచట ఋషి హృదయం.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement