శ్రీ రామచంద్రుడు సీతను అడవిలో వదలివేయడం ధర్మమా అన్న దానిపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
శ్రీరామ చంద్రుడు సీతను ఎందుకు వదిలేశాడని రామునిపై కోపము కూడా కలుగుతుంది. స్త్రీకి అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తారు. రాజ్యపాలనలో ఇబ్బంది ఉంటే సీతను తీసుకొని రాముడు రాజ్యాన్ని త్యాగం చేయవచ్చే కానీ అలా చేస్తే రామునికి స్తరీ వ్యామోహమని ఒక స్త్రీ కోసం రాజ్యమే వదులు తాడా అనే అపవాదు వస్తుంది. రాజు ప్రజలలోని విశ్వాసం నిరంతరం కలిగించటానికి రాణిని వదిలాడు. రాజు ఒక గర్భవతివలె ఉండాలి అంటే గర్భవతి తన గర్భాన్ని జాగత్తగా కాపాడుకొనుటకు తనకు అత్యంత ప్రియుడైన భ ర్తనే దూరంగా దూరంగా ఉంచుతుంది. గర్భ రక్షణ ముఖ్యమని తన ఆహారాలను, విలాసాలను వదులుకుంటుంది.
రాజుకు ప్రజలు గర్భము వంటి వారు. ప్రజారక్షణ రాజు కర్తవ్యం
భార్య భర్తకి వ్యక్తిగతం. ప్రజలు రాజ్యం సమిష్టిగతం ఒకరి కోసం పదిమందిని వదిలుకోకూడదని రాముడు సీతను వదిలాడు. సీత కళంకం లేనిదే కాని ప్రజలు కళంకాన్ని ఆపాదించారు. దాన్ని తాను భరిస్తే తన ఇక్ష్వాకువంశం అపకీర్తి పాలవుతుంది. తన ప్రజలే తనను అసహ్యించుకుంటారు. ప్రజల అసహ్యం రాజుకు మరణంతో సమానం. వంశానికి కళంకాన్ని కలిగించే హక్కు ఎవరికీ లేదు. అందుకే వంశం కోసం ప్రజలకోసం నిష్కలంక పరిపాలన కోసం తన సుఖాన్ని సంతోషాన్ని భార్యను వదిలాడు రాముడు. సీత అడవిలో ఎటువంటి జీవనం గడిపిందో అయోధ్యలో రాముడు కూడా అదే జీవనాన్ని గడిపాడు. నేల మీద పరున్నాడు. కందమూలముల వంటి సాత్త్వికాహారమును తీసుకున్నాడు. ప్రేమ వ్యక్తిగతం, ధర్మం సమాజగతం కావున సీత వలె తాను నారవస్త్రాలను ధరించి రాజసభక మాత్ర ం రాజాభరణాలను ధరించాడు. రాజు ప్రజలకు చెందిన వాడు కావున ఇన్ని ధర్మ సూక్ష్మాలను ఆలోచించి సీతను రాముడు విడిచిపెట్టాడు.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి