రాముడు ధర్మమూర్తి రాముడు వాలిని చెట్టు చాటు నుండి చంపాడు ధర్మమా? అధర్మమా? అనే దానిపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
రాముడి ధర్మమూర్తి అంటూనే అధర్మం ఆచరించాడనటం నిప్పు చల్లగా ఉంటుందని అనడం. సకల ధర్మాలూ తెలిసినట్లు రాముడిని ప్రశ్నించడం ఎంత వరకు సమంజసం. వాల్మీకి రామాయణం చదివితే ఇటువంటి సందేహాలు తీరుతాయి. రాముని చేతిలో దెబ్బతిన్న వాలి ఏ తప్పు చేయని నన్ను చాటు నుండి కొట్టి అధర్మం చేశావు, నన్ను చంపడానికి ఇది నీ రాజ్యమా? నీవు రాజువా? సీత కోసం నా వద్దకే వస్తే ఒక్క పూటలో సీతను తెచ్చి నీ ముందుంచే వాడినన్న మొదలైన సందేహాలకు రాముడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
ధర్మము పరమ సూక్ష్మం నీలాంటి వానరులకు అర్థం కాదు. ఇది నా రాజ్యం కాదన్నావు ”ఇక్ష్వాకుల ఇయం భూమి సశైల వనకాననా” పర్వతాలు, వనాలు సముద్రాలు కూడియ ఉన్న ఈ భూమి ఇక్ష్వాకుల రాజ్యమే చిత్రకూటంలో భరతుడు నేను ఒక ఒప్పందం ప్రకారం అడవిని, పర్వతాలను, నదులను, ఆ ప్రాంతంలోని ప్రాణులను వారి బాగోగులను నేను చూడాలి అలాగే నగర గ్రామాల వారిని భరతుడు శాసించాలి. ఇది మహారాజైన దశరథుని ఆజ్ఞ, ఆ తర్వాత రాజైన భరతుని ఆజ్ఞ కన్నబిడ్డతో చెల్లితో తమ్ముని భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం నీవు చేసిన తపపు ఇలా చేసిన వారికి మరణ దండన అని ధర్మశాసనం విధించబడింది. నీ తమ్ముడు సుగ్రీవుడు ఉండగా అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన నేరానికి మరణ దండన విధించాను. మరణ దండన ప్రవర్తింపచేస్తున్నపుడు నేరస్తుని ముఖము చూస్తూ వధించకూడదు. అందుకు నిన్ను చాటుగా వధించాను. నీకు రావణునికి ఉన్న ఒప్పందం ప్రకారం మీలో ఎవరికి ఏది లభించినా అది ఇద్దరికీ చెరో సగం అని కదా! నా భార్యని రావణుడు హరించాడు అని చెబితే ఒప్పందం గూర్చి చెబుతావు కానీ నాకీయజాలవు. అదిగాక నేరస్తునికి సహాయం చేయమని అడగడం నేరాన్ని సమర్థించడం ఆమోదించడమే అవుతుంది. ఆ పాపంలో నాకు కూడా భాగం వస్తుంది. ఇన్నీ ఆలోచించి విచారించి ధర్మమని నిర్ణయించి అధర్మాన్ని దండించాను. బాణపు దెబ్బను తట్టుకోలేక ఆవేశంలో మాట్లాడుతున్నావు నేను చేసినది ధర్మమే. పెద్దవారి ముందు, పండితుల ముందు, చిన్నవారు, మూర్ఖులు మాట్లాడలేరు. బాధతోనే ఇలా ఆక్షేపించానని వాలి అంగీకరించాడు. వాలి భార్య తార కూడా రాముని ఉత్తమ ధార్మకుడని స్తుతించింది కావున సందేహమెందుకు వాలిని వధించడం ధర్మమే, అధర్మ దండనే.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి