Saturday, November 23, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

గంగా ఆవిర్భావ వృత్తాంతములో భాగంగా సగర పుత్రులకు కలిగిన దుర్గతి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

సగర పుత్రులు మహావీరులు వారితో యుద్ధము చేసి గెలువజాలము కాన యుద్ధము లేకుండా వారిని గెలువవలెనని భావించి రాక్షసులు కపిల మహర్షి నిద్రించిన ప్రదేశమున అతని తలవైపు హయమును కట్టి దూరముగా వెళ్ళి జరుగుతున్న దానిని కాంచుచుండిరి. రసాతలమున ప్రవేశించిన సగర పుత్రులు నిద్రించి ఉన్న మునిని, అతని తలవైపు కట్టి ఉన్న అశ్వమును చూచి ఆ మునే అశ్వముని అపహరించి అశ్వమేధయాగమును భంగపరిచెనని, ఈ మహాపాపిని వధించి అశ్వమును తీసుకుని వెళ్ళిపోయెదమని తలచిరి. కానీ వారిలో కొందరు అశ్వమును మాత్రము తీసుకునిపోయెదమని పలికిరి. మరి కొందరు తాము శూరుల ము, రాజులము, అధర్మము చేసిన వారిని శాసించువారము కాన అధర్మము చేసిన ఈ మహాపాపిని లేపి క్షత్రియ పరాక్రమముతో వధించెదమని నిష్ఠూరముగా మాట్లాడుచూ పాదములతో అతనిని ప్రహరించసాగిరి. అంతట ఆగ్రహముతో నిద్ర లేచిన కపిల మహర్షి వారిని చూడగా క్షణకాలంలో వారంతా కాలి బూడిదయ్యిరి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement