Saturday, November 23, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

శంకరునిచే వివరించబడిన గౌతమీ నది వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

అస్యా: పరతరం తీర్థం నభూతం నభవిష్యతి
సత్యం సత్యం పునసత్యం వేదేచ పరినిష్ఠితం
సర్వేషాం గౌతమీ పుణ్యా ఇత్యుక్త్వాన్తర ధీయత

ఈ నది కంటే శ్రేష్ఠమైన తీర్థము ఇది వరకు లేదు. ఇక ముందు ఉండదు ఇది ముమ్మాటికి సత్యం. వేదములలో కూడా సుప్రతిష్టమైనది. అన్ని నదులలో గౌతమీ నది పరమపణ్యప్రదమైనది. అని చెప్పి పరమశివుడు అంతర్థానం చెందెను. లోకములచే పూజించబడు శంకరుని అంతర్థానం అనంతరం ఆయన ఆజ్ఞతో పూర్ణబలమును సంపాదించిన గౌతమ మహర్షి శంకరుడు ప్రసాదించిన జటను, నదీ శ్రేష్ఠమైన గంగను తీసుకుని దేవతలతో కలసి బ్రహ్మగిరికి వెళ్ళెను. శంకరుని జటను తీసుకువచ్చిన గౌతమునిపై పుష్పవర్షము కురిసెను. సురేశ్వరుడు, ఋషులు, బ్రహ్మణులు, క్షత్రియులు, అందరూ వచ్చి జయ జయ ధ్వానములతో, సంతోషముతో అతనిని పూజించిరి.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement