ఎలాంటి చింత, భయం లేకుండా ధర్మమార్గంలో పయనించే సమాజాన్ని నిర్మించాలని
గురు తేగ్ బహదూర్ భావించారు. ఆయన అటు తన కుటుంబం, ఇటు సమాజంలో సంస్కారాలను, విలువలను పెంపొందించారు. ధర్మం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశారు. విపత్కర పరిస్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన చేసిన కార్యం వల్ల దేశ ప్రజానీకంలో ధైర్యం పెరిగింది. బ్రజ భాషలో ఆయన ఇచ్చిన సందేశం భారతీయ సంస్కృతి, తత్వచింతన, ఆధ్యాత్మికతల మేలు కలయిక.
తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తవ్యదీక్ష దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హర గోవింద్, తల్లి నానకీ. చైత్ర కృష్ణ పంచమి నాడు ఆయన అమృత్ సర్‌లో జన్మించారు. మే 1, 2021న వీరి 400 జయంతి వేడుకలు జరుగుతాయి. ఆ సమయంలో భారతదేశంలోని చాలా భాగం మొగలాయిల పాలనలో ఉండేది. ఆ పరాయి పాలనను పరిసమా ప్తం చేసేందుకు పూనుకున్నవారిలో గురు తేగ్ బ#హదూర్ కూడా ఒకరు. ఆయన వ్యక్తిత్వం సాధన, తపస్సు, త్యాగాలకు ప్రతీకగా నిలిస్తే, ఆయన కర్తవ్య దీక్ష శారీరిక, మానసిక శౌర్యానికి గుర్తుగా నిల చింది. ఆయన గురువాణి అందరి మనస్సుల్లో నిలిచిపోయింది. నకారాత్మక ఆలోచనలు అదుపుచేయగలిగితేనే ధర్మ మార్గంలో పయనించగలుగుతారు. నిందాస్తుతి, లోభం, మో#హం వాటి వాటికి ఎవరైతే లొంగిపోతారో వారు విపత్కర పరిస్థితిని ఎదు ర్కొంటారు. సాధారణ వ్యక్తులు కష్ట సుఖాలకు విచలితుల వుతారు. కానీ యోగులు, సిద్ధపురుషులు వీటికి అతీతులు. ఈ భావాన్ని తేగ్ బహదూర్ తన బోధనల్లో తెలిపారు. గురు తేగ్ బ#హదూర్ ఇలా అంటారు ”మనిషి మృత్యువుకు చాలా భయపడ తాడు. ఆ భయం కారణంగానే మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడతాడు. జీవితంలో విలువలు వదిలిపెడతాడు. పిరికి వాడుగా మారతాడు. చనిపోయేవాడికి ఆ భయం ఉండదు. దాని గురించి చింత ఎందుకు?” ఎలాంటి చింత, భయం లేకుండా ధర్మమార్గంలో పయనించే సమాజాన్ని నిర్మించా లని గురు తేగ్ బహదూర్ భావించారు.
ఆయన అటు తన కుటుంబం, ఇటు సమా జంలో సంస్కారాలను, విలువలను పెంపొందించారు. ధర్మం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశారు. విపత్కర పరిస్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన చేసిన కార్యం వల్ల దేశ ప్రజానీకంలో ధైర్యం పెరిగింది. బ్రజ భాషలో ఆయన ఇచ్చిన సందేశం భారతీయ సంస్కృతి, తత్వచింతన, ఆధ్యాత్మికతల మేలు కలయిక.
గురు తేగ్ బ#హదూర్ నివసించిన ఆనందపూర్ సాహబ్ మొగలుల అన్యాయానికి, అత్యాచారాలకు ఎదురొడ్డి నిలిచింది. భారత్‌ను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఔరంగజేబ్ భావిం చాడు. బౌద్ధ మతానికి, ఆధ్యాత్మికతకు కేంద్రమైన కాశ్మీర్ పై దృష్టి సారించాడు. మొగలాయిల అకృత్యాలు భరించలేక కాశ్మీరీలు గురు తేగ్ బహదూర్‌కు తమ గోడు చెప్పుకున్నారు. వారు చెప్పి నది విన్న తరువాత ఆయన ఆలోచనలో పడ్డారు. ఎవరో ఒక మహాపురుషుడు దేశం, ధర్మం కోసం ఆత్మబలిదానం చేయాలి. అలాంటి బలిదానం వల్ల కలిగే ప్రజా చైతన్యం వల్ల మొగలాయిలు భయపడతారు. కానీ అలా బలిదానం ఎవరు చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తేగ్ బర్ పుత్రుడైన శ్రీ గోవింద్ రాయ్ చెప్పారు. మీకంటే మహాపురుషుడు ఎవరున్నారు?’ అని పలి కా రు.
ఔరంగజేబ్ సైన్యం గురు తేగ్ బహదూర్‌తోపాటు మరో ముగ్గురిని బంధించింది. అందరినీ ఢిల్లిd తీసుకువచ్చారు. అక్కడ వారిని అమానుషంగా చిత్ర హింసలకు గురిచేశారు. ఇస్లాం స్వీక రించాలని భయపెట్టారు, బెదిరించారు. నానాయాతనలకు గురి చేశారు. మతగురువును చేస్తామని, భోగభాగ్యాలకు లోటు ఉండ దని ఆశపెట్టారు. అయినా ముగ్గురు శిష్యులతోపాటు గురు తేగ్ బహదూర్ ధర్మాన్ని వదలలేదు. ఢిల్లిd చాందిని చౌక్‌లో గురు తేగ్ బహదూర్ ఎదురుగానే ఒక శిష్యుడైన భాయి మతిదాస్‌ను రంపంతో నిలువునా చీల్చారు. మరొక శిష్యుడు భాయి దియా లాను సలసల కాగే నూనెలో వేశారు. భాయి సతిదాస్‌ను పత్తిలో మూటకట్టి దానికి నిప్పు పెట్టారు. ఈ క్రూర, అమానుష చర్యలు చూసి గురు తేగ్ బహదూర్ భయపడతారని వాళ్ళు అనుకు న్నారు. అన్యాయం, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడటమే ధర్మమని గురు తేగ్ బహదూర్ భావించారు. అందుకనే ఆయన చలించలేదు. దానితో చివరకు ఒక కసాయి గురు తేగ్ బహదూర్ తలను నరికేశాడు. ఆయన ఈ ఆత్మబలిదా నంతో దేశమంతటా ఒక చైతన్యం వచ్చింది. పదవ గురువు గోవింద్ సింహ్ తన తండ్రి బలి దానాన్ని గురించి ఇలా అన్నారు.
తిలక్ జంజూ రాఖా ప్రభ్ తాకా కీనో బఢో కలూ మహ సాకా
సాధని హుతి ఇతి జిని కారీ సీస్ దిఆ పర్ సీ నా ఉచ్రీ
నేడు గురు తేగ్ బహదూర్ 400వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. నేడు సర్వత్ర భోగ లాలస పెరిగిపోయింది. గురు తేగ్ బహదూర్ మాత్రం మనకు త్యాగం, సం యమనాలను బోధించారు. ఇప్పుడు అంతటా ఈర్ష్య, ద్వేషం, భేద భావ నలు నిండిపో యాయి. సృజన, సమరసతలతో బాటు మానసిక వికారాలపై విజ యం సాధించడం కోసం సాధన చేయాలని గురు తేగ్ బహదూర్ ఉపదేశించారు. గురు తేగ్ బహదూర్ ప్రభావం ఎంతటి దంటే ఢిల్లిdకి వెళుతున్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయనను అనుసరించారు, ఆయన బోధలను విన్నారు. ఈ రోజుకీ ఈ గ్రామాల్లో పొగాకు వంటి మాదక పదార్ధాల పంటలు పండిం చరు. నేడు ప్రపంచంలో తిరిగి మతఛాం దసవాదం, తీవ్రవాదం పెచ్చుమీరుతు న్నాయి. గురు తేగ్ బహదూర్ త్యాగం, శౌర్యం, బలిదానపు మార్గం మనకు చూపారు. మానవజాతి పరివర్తన శీలమైన నూతన శకంలో ప్రవేశిస్తున్నది. ఈ సమ యంలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. అదే ఆయనకు మనం ఇచ్చే గౌరవం.
– దత్తాత్రేయ హూసబళే,
సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్