Friday, November 22, 2024

దేవ రాక్షస సమరం

రావణుడు స్వర్గలోకంపై దాడి చేస్తున్నాడని దేవతలు గ్రహించారు. ఇంద్రుడు ద్వాదశా దీత్యులు, అష్ట వస్తువులు, ఏకాదశ రుద్రులు, విశ్వ దేవతలు, మరుగుత్తులు మున్నగు దేవ గణాలతో పోయి శ్రీ మహా విష్ణువు శరణు కోరాడు. ”బ్రహ్మ వరప్రసాదితుడైన రావణుడు దేవ గణాలకు అజేయు డు. దేవతలను ఆపత్సముద్రం నుండి ఉద్ధరింపగల మహాత్ముడవు నీవు మాత్రమే” అని ఇంద్రుడు ప్రార్థించాడు. విష్ణువు, ”రావణ వధకు ఇది తగిన సమయం కాదు. మీరే విరోచితంగా భయ రహితులై పోరాడండి” అని ఉత్సాహ పరిచి ఇంద్రాది దేవతలను యుద్ద రంగానికి పంపాడు.
దేవ గణాలు, రాక్షసవీరుల మధ్య సంకుల సమరం జరిగింది. వృద్ద రాక్షస వీరుడు సుమాలి చండ్ర ప్రచండ మార్తాం డుడై, అన్ని దిక్కుల తానే అయి కొరకరాని కొయ్యగా పరిణమించాడు. అష్టమ వసువు సావిత్రుడు సుమాలిని మార్కొన్నాడు. ఇరు వురూ దివ్యాస్త్రవిద్యా విశారదులు, ధనుర్వి ద్యా నిపుణులు. సావిత్రుడు అసంఖ్యాక బాణా ప్రయోగంతో సుమాలికి ఊపిరి సలపకుండా యుద్ధం చేశాడు. అతని రథాన్ని భగ్నం కావించాడు. విరథుడైన సుమాలి మీదికి సావిత్రుడు లంఘించాడు. యముని కాలదండం వంటి భయంకరమైన గదతో సుమాలి తలను బద్దలుకొట్టాడు.
సుమాలి వధను చూసి మేఘనాథుడు రోషా వేశపూరితుడై తన రథాన్ని దేవతల మీదకు నడిపాడు. మేఘనాథుని శౌర్య పరాక్రమాలను సహింపలేక దేవతలు పారిపోయారు. ఇంద్రుడు పారిపోతున్న దేవతలకు ధైర్యాన్ని నూరిపోసి వారికి సాయంగా తన కొడుకు జయంత్‌ని పంపాడు. ఇంద్ర సారథి మాతలి కొడుకు గోముఖుని సారథ్యంలో జయంతుడు
యుద్ద రంగంలో దేవతలకు బాసట అయ్యాడు. దివ్య తేజోసంపన్నుడైన జయంతుడు మేఘనాధుని ఢీకొన్నాడు. వారికి వారే సాటి అన్నట్లు బాణ వర్షాన్ని కురిపించాడు. అత్యద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిం చారు. మేఘనాదుడు మాయను ప్రయోగించి గాడాంధకారాన్ని సృష్టించాడు. రాక్షసులు, దేవతలు పెను చీకటిలో పరస్పరం గుర్తింపలేకపోయారు. దేవతలు దేవతలను రాక్షసులు రాక్షసుల్ని చంపు కొన్నారు. జయంతుని తాత పులోముడు సమయ స్పూర్తితో గుట్టుగా జయంతుని యుద్దరంగం నుండి కొనిపోయాడు. హఠాత్తుగా జయంతుడు మాయమ వడం వల్ల దేవతలు దిక్కుతోచక, దిక్కుమాలిన వారై నలుదిక్కులకు పారిపోవడం ఇంద్రుడు చూశాడు.
ఇంద్రుడే స్వయంగా రణభూమికి వచ్చాడు. రావణుడు తన కొడుకు మేఘనాధుని దాటి, ఇంద్రునితో తల పడ్డాడు.
వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మర త్తులు మున్నగువారు ప్రహస్త, ధ్రూమ్రాక్ష, మహా పార్శ్వ, మహోదరాది రాక్షస వీరులను ప్రతిఘటించారు. సంకుల సమరంలో రథాలు భగ్నమయ్యాయి. ఏనుగుల కుంభస్థలాలు బ్రద్దలై నేల కూలాయి.
అశ్వికులతో పాటు అశ్వాలు తుత్తునియలై నేల పడ్డాయి. రణ రంగమంతా రక్తసిక్తమయ్యింది. దేవ రాక్షసుల తలలు, చేతులు, నడుములు, తొడలు, కాళ్లు తెగి నేలపడ్డాయి. రావణుడు ఇంద్రుని ఎదుర్కొని ఘోరంగా పోరాడారు. ఇరువురు ప్రయోగించిన అస్త్ర పరంపరతో రోదసీ నిండిపోయింది. రణరంగంలో పెనుచీకటి వ్యాపించింది.
ఇంద్రజిత్‌ ఇంద్ర రావణుల శరపరం పర వల్ల క్రమ్ముకొన్న దట్టమైన చీకటిలో దేవతలు రాక్షసులను చీల్చి చెండాడాడు. రాక్షస బలం తరిగిపోవడం గమనించి ,రావణుడు తన రథాన్ని దేవసేన సమూహం మధ్యకు నడిపించాడు. ”ఎలాంటి పరిస్థితి ఎదురైనా రథాన్ని పక్కకు మరలించవద్దు. దేవ సేనా మధ్యలో రథం తిరుగుతూ ఉండాలి” అని సారథిని హెచ్చరించాడు.
ఇంద్రుడు దేవతలను ఉద్దేశించి ” అసహాయ శూరత్వాన్ని ప్రదర్శించి, రావణుని ప్రాణులతో బంధిం చడం ప్రస్తుతం మన కర్తవ్యం! బ్రహ్మ వర గర్వితుడై మన మధ్యకు దూసుకు వస్తున్నాడు. చూశారా! అతడిని బంధించడానికి అదను ఇదే!
సమయం మించితే అతడు మన చేతికి చిక్కడు. అందరూ ఒక్కుమ్మడిగా రావణుని చుట్టుముట్టండి. అతనిని ఒంటరిని చేసి బంధిస్తే మనకు విజయం సిద్ధి స్తుంది” అని పురి కొల్పాడు. ఇంద్రుడు వ్యూహాత్మకంగా దేవ గణాలతో రావణుని చుట్టుముట్టాడు. రావణుడు దిక్కుతోచక యుద్ద విముఖుడు అయ్యాడు.
మేఘనాధుడు తండ్రి పరిస్థితి గమనించి దేవతా సమూహం మధ్యలో ప్రవేశించాడు. ఇతర దేవ నాయకులను ఏమాత్రం లెక్క చేయకుండా ఇంద్రునిపై దాడి చేశాడు. అతడు తన మాయను ప్రయోగించాడు. అందువల్ల ఇతరులకు కనపడకుండా అతడు దేవ సేనను క్రూరాతిక్రూరంగా ధ్వంసం కావించాడు.
మేఘనాధుడు అదృశ్యుడై ఇంద్రుని దారుణంగా దెబ్బతీశాడు. తన మాయతో ఇంద్రుని బంధించి కొన పోయాడు. వస్తువులు మున్నగు వారితో పోరాడు తున్న రావణుని ఉద్దేశించి ”మనకు విజయం లభిం చింది ఇంద్రాది దేవతలను నేను బంధించాను. ఇప్పుడు నీవు త్రిలోక విజేతవు! ఇక యుద్దం చాలింపు మన్నాడు. రావణుడు విజయగర్వంతో మేఘనాధుని అనుసరిం చి లంకానగరం చేరాడు. ”రాక్షస వంశ ప్రతిష్ట ను ఇనుమడింప జేశావు” అంటూ రావణుడు మేఘ నాధుని అభినందించాడు. దేవతలు నిరుత్సాహులై బ్రహ్మ వద్దకు పోయి, మేఘ నాధుని విజయాన్ని ఇంద్రుని పరాజయాన్ని తెలిపారు.
మేఘనాధుడు ఇంద్రుని బంధించి లంకకు కొని పోయాడని తెలిపారు. వెంటనే బ్రహ్మ దేవగణాలతో లంకకు వచ్చాడు. ఆకాశమందే నిలిచి, ”రావణా! నీ కొడుకు తండ్రిని మించిన తనయుడని ప్రశస్తి పొందా డు. అతని శౌర్య పరాక్రమములు నిరుపమానములు. నీ కొబుకు సాధించిన ఘన విజయం వల్ల దిక్పాలకు లను జయించాలనే నీ మనోరధం సఫలమయ్యింది. అసమాన ధైర్య సాహసాలతో యుద్ద నైపుణ్యాన్ని ప్రద ర్శించి, సర్గలోకాధిపతి ఇంద్రుని జయించి బంధిం చాడు. నేటి నుండి ”ఇంద్రజిత్‌” అను పేరుతో ప్రఖ్యాతి పొందగలడు.
ఇంద్రుని బంధ విముక్తున్ని కావింపు ము. ప్రతిఫలం ఏమికావాలి? కోరు”మన్నాడు బ్రహ్మ.
ఇంద్రజిత్తు అమరత్వాన్ని కోరాడు. ” భూ మండలంలో ఏ ప్రాణికి అమరత్వం లేదు” అన్నాడు బ్రహ్మ. అప్పుడు ఇంద్రజిత్తు ఇలా వరం కోరాడు.
”బ్రహ్మ దేవా యుద్దానికి సిద్దమవడానికి ముందే, నేను మంత్ర యుక్తంగా హవిస్సును అర్పించి, అగ్నిని సంతృప్తుని చేస్తాను. అగ్ని కుండం నుండి ఒక దివ్య రథం ఆవిర్భవించాలి.
ఆ రథంలో నిల్చి యుద్దం చేస్తున్నంత వరకు నేను అవధ్యుని అయ్యేటట్లు వరాన్ని ప్రసాదింపుమన్నాడు. నా పూజ పూర్తికాక మునుపే నేను యుద్దానికి సిద్దమ యితే నాకు మరణం ప్రాప్తించవచ్చు అన్నాడు. బ్రహ్మ సమ్మతించి, ఇంద్రజిత్తు కోరిన వరాన్ని ప్రసాదిం చాడు. ఇంద్రజిత్తు ఇంద్రుని బంధ విముక్తుడిని కావించాడు.

కె. ఓబులేశు
90528 47742

Advertisement

తాజా వార్తలు

Advertisement