Tuesday, November 26, 2024

దేవీ శక్తి పీఠాలు (ఆడియోతో..)

యాధేవి సర్వభూతేషు శక్తీ రూపేణా సంస్థితా
నమస్తస్యే – నమస్తస్యే – నమస్తస్యే నమో: నమ:

ఈ సృష్టిలో అణువు అణువు అమ్మవారి ప్రతిరూపమే.. ఓంకారం నుండి ఈ సృష్టి ఉద్భవించింది అనుకుంటే ఆ ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత.. అందుకే ఆమె సృష్టి లయకారిణి, జగదేకస్వరూపిణి, సకల చరాచరణిగా భక్తుల పూజలందుకుంటూ జగన్మాతగా విరాజిల్లుతుంది..
అయిగిరి నందిని, మహిషాసుర మర్ధిని అయిన దుర్గామాత పరమశివుని అర్ధనాదిశ్వరి పార్వతీదేవి రూపమే.. జగన్మాత పార్వతి సతీదేవి అంశతో పునర్జన్మించిందని పురాణ వర్ణన.. ఆ సతీదేవి ఆత్మార్పణ సందర్భంలో శరీర భాగాలు, ఆభరణాలు పడిన ప్రాంతాలే దివ్యక్షేత్రాలై శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి.. శక్తి పీఠాలు గురించి తెలుసుకోవాలంటే ఆ శక్తి పీఠాలు ఏర్పడడానికి కారణమైన ఈ కథ గురించి తెలుసుకోవాలి.

కథ :
బ్రహ్మ కుమారుడైనా దక్షప్రజాపతి ఒకరోజు బృహస్పతి యాగం తలపెట్టాడు.. ఆ యజ్ఞానికి త్రిలోకాలలో ఉన్న ప్రసిద్ధులందరిని ఆహ్వానించాడు.. కానీ తన కూతురైన సతీదేవినీ, అల్లుడైన శివుడిని మాత్రం పిలువలేదు.. ఎందుకంటే తండ్రి (దక్షుని) మాటని వ్యతిరేకించి శివుడిని పెళ్ళాడింది సతీదేవి. అప్పటి నుండి సతీదేవి మీద కోపంతో ఆమెని చూడటానికి కూడా దక్షప్రజాపతి ఇష్టపడలేదు.. తండ్రి యజ్ఞం తలపెట్టాడని తెలుసుకున్న సతీదేవి పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవడం ఏంటి నేనే వెళతాను అని శివుడు వద్ద ంటున్న వినకుండా ప్రమాద ఘడియలు వెంటబెట్టుకొని వెళుతుంది..

భర్త మాట కాదని వచ్చిన సతీదేవి అక్కడ అనేక అవమానాలకు గురి అవుతుంది.. దక్షప్రజాపతి తననే కాకుండా తన భర్త శివుడిని కూడా అక్కడ ఉన్న వాళ్ళ ముందు లేని పోని నిందలు వేసి అవమానిస్తాడు.. భర్తని అవమానిస్తుంటే తట్టుకోలేక తన కాలి బొటన వేలుని గీటగా ఏర్పడ్డ అగ్నిగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది.. విషయం తెలుసుకున్న త్రినేత్రుడు ఆవేశపూరితుడై తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి తన భార్య అకాల మరణానికి కారణమైన ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తాడు.. కానీ సతివియోగ దు:ఖం తీరని శివుడి ఆహుతిలో దగ్ధమైన ఆమె మృతదేహాన్ని తన భుజాన ధరించి మహా ఉగ్రతాండవం
చేస్తుంటే ఆ రుద్ర తాండవానికి ముల్లోకాలు కంపించిపోతాయి.. శివుడు తాను చేయవలసినిన కర్తవ్య కార్యక్రమాలను మరచి ఉగ్రతాండవం చేస్తుంటే ఇబ్బందులు పడుతున్న దేవతలు అందరు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో శివుడిని శాంతింప చేసి సతిదేవీ దేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి భూమండలంలో వివిధ ప్రదేశాలలో ప డేట్లు చేస్తాడు.. అలా సతీదేవి శరీర భాగాలూ, ఆభరణాలు పడిన చోట ఒక పుణ్యక్షేత్రంగా వెలిసి శక్తి పీఠాలుగా భక్తుల పూజలందుకొంటు ధైదీప్యమానంగా వెలుగొందుతున్నాయి…

ఇలా ఏర్పడ్డ శక్తి పీఠాలు గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి…
ఆది శక్తిపీఠాలు 4 అని, శక్తి పీఠాలు 51 అని ఉప శక్తి పీఠాలు మరో 26 అని పురాణ వ్యక్తులు చెపుతున్నారు. కానీ ఆది శంకరాచార్యులు వారు మాత్రం 18 శక్తి పీఠాలు గురించి క్లుప్తంగా వివరించారు… ఈ 18 శక్తి పీఠాలనే అష్టదశ శక్తిపీఠాలుగా పిలుస్తున్నాము..

- Advertisement -

అష్టాదశ శక్తిపీఠాలు – వాటి ప్రాముఖ్యం :-
ఈ భూమండలం మీద పుణ్యభూమిగా, వేద భూమిగా, పవిత్రభూమిగా వెలుగొందుతున్న భారతదేశంలో అష్టదశ శక్తి పీఠాలలో 17 శక్తి పీఠాలు ఉండటం భారతావని చేసుకున్న అదృష్టం.. ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో, వాటి ప్రాముఖ్యత గురించి ఆదిశంకరాచార్యులుగారు లోకాలనికి తెలియచేసారు…

శ్లోకం:
లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండీ క్రౌంచపట్టణ

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, ముహుర్యే ఏకవీరా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ శక్తి పీఠాని, యోగినామపి దుర్లభమ్‌

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్‌
సర్వరోగహరం దివ్యం, సర్వ సంపత్కరం శుభమ్‌

3. మూడవ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్న పట్టణంలో ఉంది.
ఇక్కడ సతీదేవి ఉదర భాగం పడి శ్రీశృంఖల దేవీగా వెలిసిందని పురాణాలు చెపుతున్నాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ ఏ ఆలయం ఉన్నట్లు గుర్తులు లేవు. ఈ ప్రద్యుమ్న నగరం కలకత్తాకి 80 కి.మీ. దూరంలో ఉంది.

4. నాల్గవ శక్తిపీఠం కర్ణాటకలోని మైసూర్‌లో ఉంది.
ఇక్కడ సతీదేవి తలవెంట్రుకలు పడి చాముండేశ్వరి దేవిగా వెలసిందని పురాణగాధలు చెపుతున్నాయి. ఇక్కడ దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రం మైసూర్‌ పట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement