ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయా నికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు సందిగ్ధంలో పడుతుంటారు. అందుకే దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం వివరించి చెబుతుంది.
దేవాలయం ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణ కు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతుంది.
దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగాను
ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.
ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణా న్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్ద టం లాంటి శ్రమదానాలకు శ్రీ మహావిష్ణు లోకప్రాప్తిలాంటి పుణ్య ఫలా లను చెప్పాయి పురాణాలు.
ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోకప్రాప్తి కలుగు తుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తినా కీర్తిమంతు డవుతాడు.
గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు.
గజ్జెలు, మువ్వలు ఇస్తే సౌభాగ్యాన్ని పొందుతాడు.
చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది.
గోపురం పైన ఎగిరే పతాకాలు ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు.
ఆలయంలో వేదికను నిర్మిస్తే పృథ్వీపతి అవుతాడు.
మనో#హరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంత సుఖాన్ని అనుభవిస్తాడు.
కమండలాలను ఇస్తే గోదాన ఫలితం దక్కుతుంది.
ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తి అవుతుంది.
చామరాలను దానంచేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.
దేవు డికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమస్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం.
దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు. దేవుడి పరిచర్యల కోసం చిన్నచిన్న పాత్రలుఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది.
ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు పుణ్య ఫలితాన్ని పొందుతాడు.
పాడిఆవును ఇస్తే గోలోకప్రాప్తి, పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి.
ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమ లోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి. దేవాలయానికి కావలసిన పదార్థాలను ఎవరికి చేతనైనంతలోవారు ఇస్తే ఆ పవిత్ర ఉత్తమవ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యం తోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొం టున్నా యన్నది అంతరార్థం.
సేకరణ: రావుల రాజేశం, 9848811424
దేవాలయాల్లో దానం చేయాల్సినవి!
Advertisement
తాజా వార్తలు
Advertisement